మార్చి డెరివేటివ్ సిరీస్ తొలి రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ఉదయం ప్రారంభం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు క్షీణించి 28,813 వద్
మార్చి డెరివేటివ్ సిరీస్ తొలి రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ఉదయం ప్రారంభం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు క్షీణించి 28,813 వద్ద నిలవగా.. నిఫ్టీ 43 పాయింట్లు తగ్గి 8,897 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 8,900 దిగువన ముగిసింది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి లాభాల పరుగు ద్వారా 8 ఏళ్ల గరిష్టానికి చేరింది. గత వారం 11 శాతం దూసుకెళ్లిన ఈ షేరు తాజాగా దాదాపు 5 శాతం ఎగసింది. రూ. 1238 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్ల నష్టాలు పరిమితమయ్యాయి.
రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, టెలికం షేర్లలో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. రిలయన్స్ జియో నుంచి పెరిగిన పోటీ, వొడాఫోన్‌లో ఐడియా విలీనం, టెలినార్‌ను కొనుగోలు చేయనున్న భారతీ వంటి అంశాల నేపథ్యంలో టెలికం కౌంటర్లు అమ్మకాలతో బలహీనపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈలో నేడు రిలయన్స్, అరబిందో ఫార్మా, లుపిన్, హెచ్‌యూఎల్, విప్రో తదితర కంపెనీలు లాభపడ్డాయి. ఐడియా సెల్యూలార్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఇన్‌ఫ్రాటెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతి ఎయిర్‌టెల్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications