ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో ఆన్‌లైన్ క్యాబ్ నిర్వహణ కంపెనీ ఉబర్ జతకట్టింది. దీని ద్వారా రిలయన్స్ పేమెంట్స్ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు చెందిన ప్రీపెయిడ్ చెల్లింపుల వ్యాలెట్.. జియోమనీని ఇకపై
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో ఆన్‌లైన్ క్యాబ్ నిర్వహణ కంపెనీ ఉబర్ జతకట్టింది. దీని ద్వారా రిలయన్స్ పేమెంట్స్ సొల్యూషన్స్ లిమిటెడ్‌కు చెందిన ప్రీపెయిడ్ చెల్లింపుల వ్యాలెట్.. జియోమనీని ఇకపై ఉబెర్ రైడ్ చెల్లింపుల కోసం వాడుకోవచ్చు. ఇకమీదట ఉబెర్ యాప్‌లో పేమెంట్స్ ఆప్షన్ దగ్గర జియోమనీ వాలెట్ కూడా చూపిస్తుంది.
ఫిబ్రవరి 20 నుంచే జియోమనీ పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చిన ఉబెర్ దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఈ సేవను విస్తరిస్తోంది. 'జియో ఎకోసిస్టమ్‌లో జియోమనీ కూడా భాగం. చాలా సులభంగా డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు జియోమనీ అనుకూలంగా ఉంటుంది. జియోమనీతో డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఉబెర్ లావాదేవీలు పెరుగుతాయి' అని జియోమనీ బిజినెస్ హెడ్ అనిర్బన్ ఎస్. ముఖర్జీ అన్నారు. 'భారత వినియోగదార్లకు వేగవంతమైన డిజిటల్ సొల్యూషన్స్‌ను అందించడానికే మేము ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాం' అని ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్ చెప్పారు.

కాగా, జియోమనీ వాలెట్‌పై ఉబెర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ప్రాంతాలను బట్టి జియో మనీతో పేమెంట్ చేసిన వారికి రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications