29,000 దాటిన సెన్సెక్స్
సానుకూల యారోపియన్ మార్కెట్ల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిశాయి. అయితే తొలుత జోరందుకుని ఏడాది గరిష్టాన్ని తాకినప్పటికీ చివర్లో వెనకడుగు వేశాయి. ఫిబ్రవరి డెరివేటివ్స్
సానుకూల యారోపియన్ మార్కెట్ల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిశాయి. అయితే తొలుత జోరందుకుని ఏడాది గరిష్టాన్ని తాకినప్పటికీ చివర్లో వెనకడుగు వేశాయి. ఫిబ్రవరి డెరివేటివ్స్ నేటితో ముగిసిన నేపథ్యంలో చివరి అర గంటలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 28 పాయింట్లు పెరిగి 28,893 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,939 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే విద్యుత్ రంగం(0.68%), మౌలిక రంగం(0.31%), చమురు,సహజవాయు రంగం(0.26%), పీఎస్‌యూ(0.24%) నష్టపోగా; ఐటీ(1.7%), టెక్నాలజీ(1.65%), స్థిరాస్తి రంగం(1.65%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.47%) లాభపడ్డాయి.
సెప్టెంబరు తర్వాత గరిష్ట స్థాయికి నిఫ్టీ
మిడ్ సెషన్ నుంచీ కొనుగోళ్లు జోరందుకోవడంతో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 8969ను అధిగమించింది. 8982 వద్ద గరిష్టాన్ని తాకింది. దీంతో 2016 సెప్టెంబర్,8 తర్వాత అత్యధిక స్థాయి ముగింపును తాకింది. ఇక సెన్సెక్స్ సైతం లాభాల డబుల్ సెంచరీ సాధించి 29,000 పాయింట్ల మార్కును దాటింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 1.7 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 0.8 శాతం, మెటల్ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. మరోపక్క పీఎస్‌యూ బ్యాంక్ 0.4 శాతం నీరసించింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం(24న) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్ మళ్లీ సోమవారం(27న) పున: ప‌్రారంభమవుతుంది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications