రిలయన్స్ జోష్‌తో 5 నెలల గరిష్టానికి సెన్సెక్స్
గత 8 ఏళ్లలో లేనివిధంగా ముకేష్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం దూసుకెళ్లడంతో మార్కెట్లకు ఒక్కసారిగా జోష్ వచ్చింది. దీంతో దేశీయ మార్కెట్లు సుమారు ఆరు నెలల గరిష్టం వద్ద ముగిశాయి. ట్రేడిం
100 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసిన సెన్సెక్స్
గత 8 ఏళ్లలో లేనివిధంగా ముకేష్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం దూసుకెళ్లడంతో మార్కెట్లకు ఒక్కసారిగా జోష్ వచ్చింది. దీంతో దేశీయ మార్కెట్లు సుమారు ఆరు నెలల గరిష్టం వద్ద ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 103 పాయింట్లు పెరిగి 28,865కు చేరుకోగా, నిఫ్టీ 19 పాయింట్లు బలపడి 8,927 వద్ద స్థిరపడింది. 2009 మే 18 తరువాత ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్‌ఐఎల్ 10 శాతంపైగా జంప్‌చేయగా.. ఈ కౌంటర్లో గత ఏడేళ్లలోలేని విధంగా భారీ ట్రేడింగ్ పరిమాణం మళ్లీ ఈ రోజే నమోదైంది. వెరసి రూ. 1200కు ఎగువన ముగియడం ద్వారా 9 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. తద్వారా మార్కెట్ విలువలో టీసీఎస్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును వెనక్కి నెట్టింది.

బీఎస్ఈలో రంగాల వారీ చూస్తే చమురు, సహజ వాయు రంగం 1.77%, బ్యాంకింగ్ 0.24% లాభపడగా; ఐటీ(1.69%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.35%), టెక్నాలజీ(1.3%), విద్యుత్-పవర్(1.28%) రంగాలు నష్టపోయాయి.
సెన్సెక్స్ టాప్ గెయినర్లలో రిలయన్స్(10.97%), యాక్సిస్ బ్యాంకు(3.93%), ఏసియన్ పెయింట్స్(2.92%), కోల్ ఇండియా(2.63%), హీరో మోటోకార్ప్(1.16%) లాభాపడగా; నష్టపోయిన వాటిలో ఎన్టీపీసీ(3.36%), టీసీఎస్(2.22%), పవర్ గ్రిడ్(2.19%), ఇన్ఫోసిస్(2.08%), టాటా స్టీల్(1.49%) ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications