2 లక్షల రూపాయలకు పైన చేసే నగదు కొనుగోళ్లు, రూ. 50 వేల పైన విత్‌డ్రాయల్స్‌కు పాన్‌ను తప్పనిసరి చేయడంతో చాలా మందికి పాన్ అవసరం ఎంతగానో ఉంటోంది. దీంతో సత్వరమే పాన్ కావాలని ఎదురుచూసే వారి
2 లక్షల రూపాయలకు పైన చేసే నగదు కొనుగోళ్లు, రూ. 50 వేల పైన విత్‌డ్రాయల్స్‌కు పాన్‌ను తప్పనిసరి చేయడంతో చాలా మందికి పాన్ అవసరం ఎంతగానో ఉంటోంది. దీంతో సత్వరమే పాన్ కావాలని ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువయింది. ప్రభుత్వ డిజిటల్ ఇండియాలో భాగంగా అన్నీ వేగవంతమైపోతున్నాయి. ఆ జాబితాలో ఇన్‌కమ్ ట్యాక్స్ వ్యవహారాలు చేరిపోయాయి. ఇక నుంచి స్మార్ట్‌ఫోన్ ద్వారా పాన్‌కార్డు సాధించేలా ఆదాయపు పన్ను శాఖ ప్రయత్నాలు చేస్తోంది.ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ-కేవైసీ ద్వారా పాన్ జారీకి యోచన
ఈ-కేవైసీ ద్వారా సిమ్ కార్డు ఇస్తున్నప్పుడు పాన్ ఎందుకు జారీ చేయకూడదని ఐటీ శాఖ ఆలోచించింది. దానిని త్వరలో ఆచరణలోకి తీసుకురానున్నట్లు సీబీడీటీతో సంబంధం ఉన్న ఒక అధికారి వెల్లడించినట్లు పీటీఐ పేర్కొంది. ఈ విధంగా చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి పాన్ కార్డులు జారీచేయటం ద్వారా ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావచ్చనేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది.

యాప్ ద్వారా పన్ను కట్టొచ్చు!
యాప్‌కు సంబంధించిన కసరత్తు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఈ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లోనే పన్ను కట్టొచ్చు, ట్యాక్స్ రిటర్నులను ట్రాక్ చేసేందుకు సైతం వీలు ఉంటుంది. ఇప్పటి దాకా పాన్ లేకుండా ఉన్న వారు పన్ను రిటర్నులను సత్వరమే తెలుసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లోనే పాన్ కార్డు దరఖాస్తును చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాలను వెల్లడించిన ఒక అధికారి వీటన్నింటికి ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు.

ఆధార్ సాయంతో పారదర్శకంగా, వేగంగా
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 113 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. కొత్త సిమ్ కార్డులు జారీ చేసేటప్పుడు విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్యను ఆధారంగా చేసుకుని సిమ్ కార్డులను జారీ ప్రక్రియను వేగవంతం చేశారు. అంతే కాకుండా బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసి సబ్సిడీల లీకేజీలను అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ విధానం ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలకే నగదు బదిలీ చేసే విధానం ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ ఆధార్ ద్వారా తమ పనులను ఎంత వేగంగా, పారదర్శకంగా చేయొచ్చో పరిశీలిస్తున్నాయి.

ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా
జనవరి 1 నుంచి ఐటీ శాఖ అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన పాన్ కార్డులను జారీ చేస్తోంది. దాని పైన రాతలు ఆంగ్లంలోనూ, హిందీలోనూ ఉండే విధంగా కొత్త కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు కోసం మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. చెల్లింపును సైతం నెట్‌బ్యాంకింగ్, కార్డుల ద్వారా జరపొచ్చు. యాప్ ద్వారా మరింత వేగంగా జారీ అయ్యే పాన్ కార్డు సత్వరమే రావాలని ఆశిద్దాం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications