వార్షిక నిర్వహణ రుసుమును రూ. 190 నుంచి రూ. 95కు తగ్గిస్తున్నట్లు ఎన్ఎస్డీఎల్ ప్రకటించింది. ఖాతా తెరిచేటప్పుడు చెల్లించాల్సిన ప్రారంభ రుసుమును రూ. 50 నుంచి రూ. 40కు, ప్రతి లావాదేవీ రుసుమును రూ.
ఎన్పీఎస్ ఖాతాదారులకు శుభవార్త. ఎన్పీఎస్(జాతీయ పింఛను పథకం-నేషనల్ పెన్షన్ స్కీమ్) ఖాతా తెరిచేందుకు వసూలు చేసే చార్జీ, నిర్వహణ రుసుములను ఏప్రిల్ 1 నుంచి తగ్గించాలని ఎన్ఎస్డీఎల్ నిర్ణయించింది. ఖాతాదారులు నిర్వహించుకునే ఎన్పీఎస్ ఖాతాలన్నింటినీ ఎన్ఎస్డీఎల్ అనే ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. ఎన్పీఎస్ ఖాతాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కొన్ని సంస్థలకు అనుమతిచ్చింది. అందులో ఎన్ఎస్డీఎల్ ఒకటి.

ఇన్ని రోజులు ఎన్ఎస్డీఎల్ మాత్రమే రికార్డుల నిర్వహణను చూసే సంస్థగా ఉండేది. ఈ రోజు నుంచి కార్వీ అనే ప్రయివేటు ఆర్థిక సేవల నిర్వహణ సంస్థకు సైతం రికార్డుల నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నారు.
దీంతో ఈ రంగంలో పోటీ నెలకొననుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్డీఎల్ నిర్వహణ చార్జీలను తగ్గిస్తున్నట్లు సమాచారం.
* శాశ్వత పదవీ విరమణ ఖాతా(పీఆర్ఏ) వార్షిక నిర్వహణ రుసుమును రూ. 190 నుంచి రూ. 95కు తగ్గిస్తున్నట్లు ఎన్ఎస్డీఎల్ ప్రకటించింది.
* ఖాతా తెరిచేటప్పుడు చెల్లించాల్సిన ప్రారంభ రుసుమును రూ. 50 నుంచి రూ. 40కు, ప్రతి లావాదేవీ రుసుమును రూ. 4 నుంచి రూ. 3.75కు తగ్గిస్తున్నట్లు పీఎఫ్ఆర్డీఏ వెల్లడించింది.
* మరో వైపు కార్వీ సంస్థ ఖాతా ప్రారంభ రుసుమును రూ. 39.36, వార్షిక నిర్వహణ రుసుమును రూ. 57.63, ప్రతి లావాదేవీ రుసుమును రూ. 3.36 గా నిర్ణయించడం గమనార్హం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications