ఇప్పటి వరకు గ్యాస్ సబ్సీడీ కోసం ఆధార్ తప్పని సరి అయ్యింది. ఇప్పుడు రేషన్ సరుకులు పొందాలంటే కూడా ఆధార్ తప్పకుండా కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదలకు అందే ప్రభుత్వ రేషన్లో జ
ఇప్పటి వరకు గ్యాస్ సబ్సీడీ కోసం ఆధార్ తప్పని సరి అయ్యింది. ఇప్పుడు రేషన్ సరుకులు పొందాలంటే కూడా ఆధార్ తప్పకుండా కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదలకు అందే ప్రభుత్వ రేషన్లో జరిగే అక్రమాలను, లీకేజీలను అరికట్టేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జూన్ 30 ఆఖరి గడువు
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్‌కార్డులను వ్యవస్థాగతంగా నిర్వహించేందుకు ఒక పటిష్టమైన విధానం ఉండాలి. అందుకోసం 1,40,000 కోట్ల రూపాయలను వృథా కాకుండా సబ్సిడీ కోసం ఉపయోగించే డబ్బును సమర్థంగా ఉపయోగించాలనేది కేంద్రం ప్రణాళిక. అందుకే రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానం కానివారు జూన్ 30 తేదీ లోపు లింకేజీ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. జూన్ 30 తరువాత ఆధార్ కార్డు లేకుండా రేషన్ సరకులు ఇవ్వవద్దని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.

జాతీయ ఆహార భద్రతా చట్టం
గతేడాది నవంబర్‌లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటులో పాస్ చేశారు. దీని ప్రకారం ప్రతి పౌరుడికి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలను ప్రభుత్వమే అందించాల్సి ఉంటుంది. పథకంలో లబ్ది పొందే వారి సంఖ్య 80 కోట్లు ఉండగా, ఆహార ధాన్యాల ధర రూ. 1 నుంచి రూ. 3 మధ్యే ఉండాలి.ఆహార భద్రతా చట్టం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అక్రమాలను అరికట్టేందుకు ఆధార్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని చూస్తోంది. దీని ప్రకారం ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 8న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

కొత్త లబ్దిదారులకు సైతం ఇదే అమలవుతుంది
నోటిఫికేషన్ అస్సాం, మేఘాలయ, జమ్మూకాశ్మీర్ తప్ప అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తుంది. రేషన్ పొందడానికి దరఖాస్తు చేసి కొత్తగా లబ్దిదారులుగా చేరే వారికి సైతం ఇదే నిబంధన అమలవుతుందని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకూ ఆధార్ లేకపోతే ఆహార భద్రతా చట్టం ప్రకారం జూన్ 30 లోపు ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుని రేషన్ డీలర్లకు ఆధార్ దరఖాస్తు సంఖ్యను కానీ, ఆధార్ సంఖ్యను కానీ ఇవ్వాల్సిందేనని సంబంధిత మంత్రిత్వ శాఖ వెలువరించిన ప్రకటన ద్వారా స్పష్టం అవుతోంది. భారత సంచిత నిధి నుంచి ఆహార భద్రతా చట్టం అమలుకు నిధులను వినియోగిస్తున్నందున నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

అవసరమయ్యే పత్రాలు
లబ్దిదారులందరికీ దాదాపుగా ఆధార్ కార్డులు అందాయి. జూన్ 30 గడువు తర్వాత రేషన్ కార్డుతో పాటు ఆధార్‌ను చూపితేనే లబ్దిదారులకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఆధార్ లేని వారు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం ప్రయత్నించినప్పుడు ఇచ్చే కాపీని అయినా చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్ దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లను వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. వోటర్ కార్డు, పాన్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన ఫోటో ఐడీ, పోస్టల్ మంత్రిత్వ శాఖ జారీ చేసే చిరునామా గుర్తింపు, కిసాన్ ఫోటో పాస్‌బుక్, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే గుర్తింపు పత్రాలు.

ఆధార్ నమోదు ఎలా?
ఆధార్ నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియకు ఆధార్ నమోదు (ఎన్‌రోల్‌మెంట్) కేంద్రాన్ని సందర్శించవలసి ఉంటుంది, ఆధార్ నమోదు కేంద్రానికి అనుమతి ఉన్న చోట వెళ్లి రసీదు పొందడానికి ఎన్రోల్మెంట్ ఫారం నింపి, డెమోగ్రాఫిక్ మరియు బయోమెట్రిక్ డేటా క్యాప్చర్ చేసి, ఐడెంటిటీ (గుర్తింపు) మరియు అడ్రస్ (చిరునామా) డాక్యుమెంట్లను సమర్పించవలెను. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక నమోదు కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఇది కూడా చదవండి ఆధార్ అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఆధార్ స్టేటస్ (స్థితిని) చెక్ (తనిఖీ) చేసుకోవడం:
ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తయిన పౌరులు వారి ఆధార్ లేదా ఇంకా జనరేషన్ కింద ఉందా అను స్టేటస్ (స్థితిని) ఈ లింక్ లోకి వెళ్లి వారి ఎన్రోల్మెంట్ రసీదు స్లిప్ పైన ఉండే తాత్కాలిక ఎన్రోల్మెంట్ ఐడి - ఇఐడి (14 అంకెల ఎన్రోల్మెంట్ సంఖ్య మరియు 14 అంకెల ఎన్రోల్మెంట్ తేదీ మరియు సమయం) వివరాలను అందించడం ద్వారా తెలుసుకోవచ్చు https://resident.uidai.net.in/web/resident/check-aadhaar-status

ఈ-ఆధార్ డౌన్ లోడ్:
ఇప్పుడు మీరు మీ ఆధార్ యొక్క ఎలక్ట్రానిక్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇ-ఆధార్ అసలైన ఆధార్ కార్డు లాగే చెల్లుతుంది మరియు మీ ఆధార్ లేదా ఎన్రోల్మెంట్ రసీదు స్లిప్ పైన ఉండే తాత్కాలిక ఎన్రోల్మెంట్ ఐడి - ఇఐడి (14 అంకెల ఎన్రోల్మెంట్ సంఖ్య మరియు 14 అంకెల ఎన్రోల్మెంట్ తేదీ మరియు సమయం) వివరాలను సమర్పించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు https://eaadhaar.uidai.gov.in/
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications