పెద్ద నోట్ల మార్పిడి నిర్ణయం తర్వాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు వెల్లువెత్తాయి. అయితే ఏ రాష్ట్రంలో డిపాజిట్లు ఎక్కువయ్యాయనే విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. జన్‌ధన్ డిపాజిట్లకు సంబంధించి ప్ర
పెద్ద నోట్ల మార్పిడి నిర్ణయం తర్వాత బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు వెల్లువెత్తాయి. అయితే ఏ రాష్ట్రంలో డిపాజిట్లు ఎక్కువయ్యాయనే విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. జన్‌ధన్ డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వం, ఆర్‌బీఐ వివరాలను సేకరిస్తున్నాయి. ఐటీ శాఖ సైతం అనుమానస్పద లావాదేవీలపై దృష్టి సారించింది. మొత్తం ఆయా ఖాతాల్లో డిపాజిట్ల విషయంలో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండగా కర్ణాటక రూ. 1156 కోట్ల డిపాజిట్లతో రెండవ స్థానంలో ఉంది. ఈ డిపాజిట్లలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

పెద్ద నోట్ల మార్పిడికి ముందు జన్ ధన్ ఖాతాల్లో నవంబరు 9న రూ. 1412 కోట్లుండగా జనవరి 25 తర్వాత ఇది ఏకంగా రూ. 2568.76 కోట్లకు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. అంటే దాదాపు డిపాజిట్లలో 82 శాతం అనూహ్యమైన పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కొంత మందికి నోటీసులు జారీ చేశారు. చాలా మందికి మెయిల్స్, సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు. పొదుపు మొత్తాలను జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్ చేసి ఉంటే అలాంటి ఖాతాదార్లను వేధించొద్దని ప్రభుత్వం నుంచి అధికారులకు సూచనలు అందినట్లు సమచారం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications