ఎయిర్‌టెల్, రిల‌య‌న్స్ జియో మ‌ధ్య స‌మ‌స్య ఏంటి?

ప్ర‌భుత్వ జోక్యంతో ఆ మ‌ధ్య కాస్త స‌ద్దుమ‌ణిగిన జియో, ఎయిర్‌టెల్ మాట‌ల వివాదం మ‌ళ్లీ కొన‌సాగేలా క‌నిపిస్తోంది. ట్రాయ్ సైతం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌ని నేప‌థ్యంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీల

ప్ర‌భుత్వ జోక్యంతో ఆ మ‌ధ్య కాస్త స‌ద్దుమ‌ణిగిన జియో, ఎయిర్‌టెల్ మాట‌ల వివాదం మ‌ళ్లీ కొన‌సాగేలా క‌నిపిస్తోంది. ట్రాయ్ సైతం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌ని నేప‌థ్యంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఈ నేప‌థ్యంలో దీని గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలను ఇక్క‌డ తెలుసుకుందాం.

అప్ప‌ట్లో ట్రాయ్ జోక్యం

అప్ప‌ట్లో ట్రాయ్ జోక్యం

ఇంటర్ కనెక్ట్ పాయింట్స్, కాల్ ఫెయిల్యూర్స్ విషయంలో భారత టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్‌పై జియో మండిపడుతోంది. వాస్తవానికి ఈ విషయంపై టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతేడాది అక్టోబర్‌లో ఎయిర్‌టెల్‌కు చీవాట్లు పెట్టింది. జియో నుంచి మీ నెట్‌వర్క్‌కు వస్తున్న కాల్స్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని, నిబంధనల ప్రకారం సరిపడా ఇంటర్‌ కనెక్ట్ పాయింట్లు ఇవ్వాలని ఆదేశించింది.

ట్రాయ్‌కు ఎయిర్‌టెల్ నివేదిక‌

ట్రాయ్‌కు ఎయిర్‌టెల్ నివేదిక‌

దీనిపై ఎయిర్‌టెల్ మంగళవారం ఓ నివేదికను ట్రాయ్‌కి అందజేసింది. తమ నెట్‌వర్క్‌పై జియోకు 35వేల ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఇచ్చామని, ఇవి కనీసం 190 మిలియన్ వినియోగ‌దారులకు సరిపోతాయని వివరించింది. జియోకు ప్రస్తుతం 72.5 మిలియన్ వినియోగదారులు ఉన్నారు కాబట్టి ఇది చాలా ఎక్కువని తెలిపింది. అయితే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దీనిపై ఘాటుగా స్పందించింది.

జియో స్పంద‌న‌

జియో స్పంద‌న‌

ఎయిర్‌టెల్ చెప్పేవన్నీ అబద్ధాలనిరిలయన్స్ జియో కొట్టిపారేసింది. ఎయిర్‌టెల్ కారణంగా తమ నెట్‌వర్క్‌లో రోజుకి 2.6 కోట్ల కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని జియో ఆరోపించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి ఎయిర్‌టెల్ నుంచి వ‌చ్చే, ఎయిర్‌టెల్‌కు ఫోన్ కాల్స్‌కు సంబంధించి చేసే వాటిలో తమ నెట్‌వర్క్ ప‌రిధిలో 53.4 శాతం కాల్స్ ఫెయిలయ్యాయని, ట్రాయ్ నిబంధనల ప్రకారం చూస్తే ఇది చాలా ఎక్కువని ఆక్షేపించింది. వాస్తవానికి ట్రాయ్ నిబంధనల ప్రకారం రోజుకి 0.5 శాతానికి మించి కాల్స్ ఫెయిల్ కాకూడదు. అయితే జియో ఆరోపణలపై ఎయిర్‌టెల్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

 మొద‌టి నుంచి ట్రాయ్ చోద్యం చూస్తుండ‌టం వ‌ల్లే ఇలా...

మొద‌టి నుంచి ట్రాయ్ చోద్యం చూస్తుండ‌టం వ‌ల్లే ఇలా...

ఇంటర్ కనెక్ట్ పాయింట్లు వినియోగదారులకు సంబంధించిన అంశమని పేర్కొంటూ ట్రాయ్ చేతులు దులుపుకుంది. అయితే ఈ వ్యవహారంలో తమ పర్యవేక్షణ కూడా ఉంటుందని నొక్కి చెప్పింది. మొద‌ట్లో జియోపై మూకుమ్మ‌డిగా అన్ని సంస్థ‌లు ఫిర్యాదులు చేసిన‌ప్పుడు స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డ‌మే కాకుండా, త‌ర్వాత ఇంట‌ర్ క‌నెక్ష‌న్ పాయింట్ల విష‌యంలో వినియోగదారులు ఎంత‌గా ఇబ్బందులు ప‌డుతున్నా స‌మ‌స్య తీర్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌క‌పోవ‌డం శోచ‌నీయం. 2040 నాటికి అమెరికాను అధిగ‌మించ‌నున్న భార‌త్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+