పెద్ద నోట్ల మార్పిడి తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కొద్ది కొద్దిగా ఉపశమనం కలిగిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరో ముందడుగేసింది. కరెన్సీ విత్ డ్రా పరిమితిని వారానికి రూ. 50 వేలకు పెంచింది
పెద్ద నోట్ల మార్పిడి తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కొద్ది కొద్దిగా ఉపశమనం కలిగిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరో ముందడుగేసింది. కరెన్సీ విత్ డ్రా పరిమితిని వారానికి రూ. 50 వేలకు పెంచింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మార్చి 13 నుంచి నగదు విత్ డ్రాపై పరిమితిని పూర్తి స్థాయిలో ఎత్తివేయనున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం వారంలో గరిష్టంగా రూ.24 వేలను మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంది. జనవరి 27 నాటికి రూ. 9.92 లక్షల కోట్ల విలువైన కొత్త రూ.500, రూ.2000 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ వివరణ ఇచ్చింది.

ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా పరిమితిని రూ.2,500 నుంచి రూ.4,500కు పెంచుతూ జనవరి 1న రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తర్వాత జనవరి 16 నుంచి దాన్ని రూ.10 వేలకు పెంచారు. ఇప్పటికే కరెంటు ఖాతాల ద్వారా నగదు విత్ డ్రా విషయంలో ఆర్‌బీఐ ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. రూ.50వేల నుంచి రూ. లక్ష వరకూ ఈ పరిమితిని గతంలోనే ఆర్‌బీఐ పెంచింది. నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువరించిన తర్వాత నగదు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు పలు ఆంక్షలు విధించిన సంగతి అందరికీ విదితమే.
ఇది కూడా చదవండి మీరు బిల్లు చెల్లింపులు చేసేందుకు పనికొచ్చే వ్యాలెట్లు
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications