బడ్జెట్ 2017-18ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తంలో రైల్వే బడ్జెట్‌ను కలపడమే కాకుండా ఎప్పటిలా కాకుండా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఈ బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2017-18
బడ్జెట్ 2017-18ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తంలో రైల్వే బడ్జెట్‌ను కలపడమే కాకుండా ఎప్పటిలా కాకుండా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ఈ బడ్జెట్ ప్రత్యేకత. వేతన జీవులకు ఆదాయపు పన్నుల్లో ఊరటతో పాటు రైతులు, యువత, గ్రామీణాభివృద్ది వంటి అంశాలే ప్రాధాన్యంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్లో మనం గమనించాల్సిన ప్రధాన అంశాలేమిటో చూద్దాం.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
పట్టణ ప్రాంత వాసులందరికీ సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పట్టణ పేదలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2015 జనవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2022 సంవత్సరాన్ని ఈ పథకానికి తుది గడువుగా నిర్ణయించారు. అప్పటికల్లా అందరికీ ఇళ్లు ఉండాలనేది కేంద్రం స్వప్నం. ఆర్థికంగా వెనుకబడిన వారు, అల్పాదాయం కలిగిన వారు శాశ్వత నివాసం పొందే దిశగా పథకం అడుగులు వేస్తోంది. ఇందుకోసం బడ్జెట్ 2017లో కేటాయింపులను 15 వేల కోట్ల నుంచి 23 వేల కోట్లకు పెంచారు. ఈ పథకం ద్వారా గృహ రుణం తీసుకునే లబ్దిదారులకు వడ్డీ రాయితీలను అందిస్తారు.

ఫసల్ బీమా యోజన
రైతులు 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే వారికి పూర్తి వడ్డీ రాయితీ కల్పిస్తాం. వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అరుణ్ జైట్ల ప్రకటించారు. ఈ ఏడాది రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించేందుకు లక్ష్యంగా ఉంది. అంతే కాకుండా రైతులకు వాతావరణ పంటల ఆధారిత బీమా పథకానికి పెద్ద పీట వేశారు. ఫసల్ బీమా కవరేజీని ప్రస్తుతం ఉన్న 30% నుంచి 40 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు. రైతులకు కలిగే పంట నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా తగ్గించేందుకు కేంద్రం గత బడ్జెట్లో ఈ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన
ప్రధాన గ్రామ్ సడక్ యోజన కింద రోడ్ల విస్తరణను విస్తృతం చేయనున్నారు. ప్రతి రోజూ 133 కి.మీ. నిర్మించనున్నట్లు ప్రకటించారు. 2011-14 మధ్య రోజుకు రూ. 73 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరిగేది. ఈ పథకం కింద పేదరికాన్ని తగ్గించేందుకు వీలుగా ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు, మారుమూల ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేని గృహాలకు పక్కా రోడ్లను వేస్తారు.

వ్యక్తులకు ఆదాయపు పన్ను రిలీఫ్
వేతన ఉద్యోగం చేసే వ్యక్తులకు సంబంధించి కనీస ఆదాయ పన్ను పరిమితిని రూ. 2.5 లక్షల దగ్గరే వుంచారు. కానీ రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయం కలవారికి పన్ను శాతాన్ని 10% నుంచి 5 శాతానికి తగ్గించారు. ఆదాయం రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఆదాయం కలవారు 10% సర్‌చార్జీ చెల్లించాల్సి వస్తుంది. పన్ను రిటర్నుల కోసం కేవలం ఒక పేజీనే ఉండబోతోంది. అయితే అందరూ ఆశించిన దానికి భిన్నంగా ఆదాయపన్ను శ్లాబులు యథాతథంగా ఉంచడం విశేషం.

కర్షకుల(రైతుల) కోసం బడ్జెట్ ఏం చేసింది?
డెయిరీ రంగానికి మౌలిక సదుపాయాల కోసం నాబార్డు కింద నిధులు విడుదల చేస్తారు. ఇందుకోసం రూ.8 వేల కోట్లు కేటాయించారు. ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్ ఫార్మింగ్) కోసం నమూనా చట్టాన్ని రూపొందించి సంప్రదింపుల కోసం రాష్ట్రాలకు పంపనున్నారు. పంట ఉత్పత్తులను శుద్ధి చేసేందుకు, ప్యాకింగ్ చేసేందుకు రూ.75 లక్షల వరకు సాయం అందిస్తారు. 63 వేల ప్రాథమిక వ్యవసాయ రుణ సొసైటీలను నెలకొల్పేందుకు నాబార్డుకు కేంద్రం మద్దతుగా నిలుస్తుంది. ఇందుకోసం రూ.1,900 కోట్లు కేటాయించారు. వేసవి, శీతాకాల పంటలు పండే ప్రాంతాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచుతారు సాయిల్ హెల్త్ (భూసార పరీక్ష)కార్డులను సకాలానికి జారీ చేసే విధంగా కృషి విద్యాకేంద్రాల్లో మినీ ల్యాబ్‌లను నెలకొల్పనున్నారు. చిన్న, మధ్య తరహా రైతులకు రుణాల మంజూరులో ఇబ్బందులను తొలగించేందుకు నాబార్డును కంప్యూటరైజ్ చేయనున్నారు.
ఈశాన్య రాష్టాలు కాశ్మీర్ సహా వెనుకబడిన ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా రైతులపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులకు కేంద్రం తీపి కబురు
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులకు శుభవార్త, మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ రద్దు) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు లభిస్తుంది. రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి క్యాపిటల్ గెయిన్స్ రద్దు వర్తిస్తుంది.

యువత, నైపుణ్యాభివృద్ది కోసం ఇతోధిక కేటాయింపులు
పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు. వైద్య పరికరాల ధరల తగ్గింపు
ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. నిపుణులైన వైద్యుల నియామకం.
ఉపాధి అవకాశం ఎక్కువగా ఉన్న కోర్సుల ఏర్పాటు.
సంకల్ప్ పథకం ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ.
దేశం వెలుపల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ.
దేశవ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు.
ఐసీటీ ద్వారా విద్యాబోధన. అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ
ప్రతిభ కలిగిన కళాశాలల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు.
సెకండరీ విద్యలో ఆవిష్కరణలకు ప్రత్యేకనిధి.

ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో వేగం పెంచేందుకు చర్యలు
ఆధార్ ఆధారిత చెల్లింపులు త్వరలో ప్రారంభం
మొబైల్, డెబిట్ కార్డులు లేకున్నా ఆధార్‌తోనే పేమెంట్ చేయవచ్చు
సెప్టెంబర్ 2017 నాటికి 20 లక్షల ఆధార్ బేస్‌డ్ చెల్లింపు కేంద్రాలు
వచ్చే ఏడాది రెండున్నర వేల కోట్ల నగదు రహిత లావాదేవీల లక్ష్యం
భీమ్ యాప్ ను 125 లక్షలమంది డౌన్ లోడ్ చేసుకున్నారు
రక్షణశాఖ విశ్రాంత ఉద్యోగులకు వెబ్ ఆధారిత పింఛన్ సేవలు
20లక్షల ఆధార్ ఆధారిత స్వైపింగ్ యంత్రాలు

రైల్వేల కోసం
2017-18 రైల్వే బడ్జెట్ రూ.1,31,000 కోట్లు కేటాయించారు.
దివ్యాంగులకు(పీహెచ్) అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు నిర్మిస్తారు.
ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సేవా పన్నును తొలగించారు
రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు
రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు
2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్‌లెట్స్
7వేల రైల్వే స్టేషన‍్లలో సోలార్ పవర్ ఏర్పాటు
కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లు
స్టేషనరీ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద 25 స్టేషన్ల ఎంపిక
9 రాష్ట్రాల్లో 70 ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం
కొత్తగా 3500 కి.మీ రైల్వే లైన్ల నిర్మాణం

డిజిటల్ బడ్జెట్
రూ.10వేలకోట్లతో భారత్‌నెట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు..ఇందులో భాగంగా లక్షా 55వేల కిలోమీటర్లమేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా హై స్పీడ్ బ్రాండ్ బ్యాండ్ సేవలు అందించనున్నారు.. ఈ కనెక్టివిటీ దేశంలోని దాదాపు 1,50వేల గ్రామపంచాయితీలను కలుపుతుంది.. వైఫై హాట్ స్పాట్స్, డిజిటల్ సర్వీసులు తక్కువ ధరకే ఈ గ్రామాల్లో అందుబాటులోకి రానున్నాయ్..డిజిగావ్ పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా మారుమూల పల్లెటూళ్లలోనూ టెలిమెడిసిన్, ఎడ్యుకేషన్, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని అరుణ్ జైట్లీ చెప్పారు

రక్షణ రంగానికి కేటాయింపులు ఘనమే
దేశ భద్రతకు కీలకమైన రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ మిగతా రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేయడం విశేషం. బలమైన సైన్యం బలమైన దేశానికి ప్రతీక. ఆర్థికంగా ఎంత వృద్ధి సాధించినా దేశాన్ని అప్రమత్తంగా రక్షించే రక్షణదళాల అవసరం వుంది. చైనా, పాక్‌ల నుంచి సవాళ్లు పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని రూ.2.74 లక్షల కోట్లను కేటాయించారు. రక్షణశాఖలోనూ వెబ్ బేస్డ్ పెన్షన్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు

రాజకీయ పార్టీల విరాళాలపై
రూ. 2 వేల అంతకంటే రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు ఇప్పటి నుంచి నగదు రూపంలో ఇవ్వడానికి లేదు. ఆ పైన ఎంతైనా చెక్కు, డీడీ లేదా ఆన్‌లైన్ ద్వారా వచ్చే సొమ్ముకు పరిమితులు లేవు. ఎలక్టోరల్ బాండ్లను తీసుకువచ్చేందుకు వీలుగా ఆర్‌బీఐ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదించారు. దేశంలో నమోదయిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల సదుపాయాన్ని అనుమతిస్తారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications