హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రోబో బ్యాంకింగ్
శాఖలోకి వచ్చే ఖాతాదారులకు స్వాగతం తెలపడంతోపాటు వారు ఏ సేవనైతే పొందాలనుకుంటారో అందుకు సంబంధించిన కౌంటర్ వివరాలను ఈ రోబో తెలియజే స్తుంది. అంతేకాకుండా ఆ కౌంటర్ వద్దకు వినియోగదారును తీసుకువెళుతుంది.
ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మనిషి రూపంలో ఉన్న హ్యూమనాయిడ్‌తో వినియోగదారు సేవలను అందుబాటులోకి తెచ్చింది. ముంబైలోని కమలా మిల్స్ శాఖలో దీని సేవలను శుక్రవారం రోజు ప్రారంభించారు. దీనికి ఇరా అనే పేరుపెట్టారు. శాఖలోని వెల్‌కమ్ డెస్క్ వద్ద ఈ హ్యూమనాయిడ్‌ను ఉంచుతారు. శాఖలోకి వచ్చే ఖాతాదారులకు స్వాగతం తెలపడంతోపాటు వారు ఏ సేవనైతే పొందాలనుకుంటారో అందుకు సంబంధించిన కౌంటర్ వివరాలను ఈ రోబో తెలియజే స్తుంది. అంతేకాకుండా ఆ కౌంటర్ వద్దకు వినియోగదారును తీసుకువెళుతుంది. ఖాతాదారు సంబంధిత కౌంటర్ వద్దకు చేరుకోగానే రోబో తానున్న చోటుకు వెనక్కు వెళ్లిపోతుంది.

మొదటి విడతలో భాగంగా నగదు డిపాజిట్, పారిన్ ఎక్స్ఛేంజ్, రుణాలు తదితరాలకు సంబంధించిన కౌంటర్ల వివరాలను ఇది తెలియజేస్తుందని, తర్వాత విడతలో కస్టమర్ వాయిస్, ఫేస్ రికగ్నిషన్, వాయిస్ ఆధారిత నావిగేషన్, నగదు నిల్వకు సంబంధించిన వివరాలు, చెక్ డిపాజిట్ తదితర సర్వీసులను ఈ రోబో ద్వారా అందించనున్నట్టు బ్యాంకు కంట్రీ హెడ్ (డిజిటల్‌బ్యాంకింగ్) నితిన్ చుగ్ తెలిపారు. వినియోగదారు సేవల కోసం రోబోను వినియోగిస్తున్న తొలి బ్యాంకు తమదేనని ఆయన చెప్పా రు. రోబోటిక్స్, ఆర్టిఫిషల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీల ద్వారా ఈ రోబోను రూపొందించినట్టు చెప్పారు. రెండేళ్ల కాలంలో వివిధ శాఖల్లో 15 నుంచి 20 మనిషి రూపంలో ఉన్న హ్యూమనాయిడ్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో దీన్ని నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications