కరెంట్ ఖాతా అనేది, ఖాతాదారుడు, బ్యాంకులో దాచుకున్న సోమ్మును, ఏ సమయంలో నైనా తిరిగి తీసుకునే సదుపాయం కలదు. సోమ్ము దాచుకున్న ఖాతాదారుడు ఈ ఖాతాలను స్వేచ్ఛగా రోజులో ఎన్ని సార్లు అయినా విత్‌డ్రా, డిపాజిట్
కరెంట్ ఖాతా అనేది, ఖాతాదారుడు, బ్యాంకులో దాచుకున్న సోమ్మును, ఏ సమయంలో నైనా తిరిగి తీసుకునే సదుపాయం కలదు. సోమ్ము దాచుకున్న ఖాతాదారుడు ఈ ఖాతాలను స్వేచ్ఛగా రోజులో ఎన్ని సార్లు అయినా విత్‌డ్రా, డిపాజిట్‌ల కోసం వాడుకొనవచ్చు. కానీ పొదుపు ఖాతాల విషయంలో పరిమిత లావాదేవీలకే అవకాశం ఉంటుంది. ఈ కరెంట్ ఖాతాను చిన్న చిన్న వ్యాపారులు, వర్తకాలు, వృత్తులలో ఉన్నవారు తెరుస్తారు. కరెంట్ ఖాతాలు , పొదుపు ఖాతాల వలె క్రమంగా వడ్డీని అందించవు. కరెంటు ఖాతా తెరిచే విధానం, అర్హతలను తెలుసుకుందాం.

ఈ ఖాతాలు ఎవరి కోసం?
ప్రాధమికంగా వ్యాపార అవసరాల నిమిత్తం, కరెంట్ ఖాతాలు ఉద్దేశించబడ్డాయి. వ్యాపారులు, భాగస్వామ్య వ్యాపార సంస్ధలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్ధలు మొదలైనవి, ఈ ఖాతాను ఉపయోగించుకుంటాయి. ధనలావాదేవీలను, వ్యాపారంలోని ప్రతి స్ధాయిలో, ఎటువంటి యిబ్బంది లేకుండా సవ్యంగా జరగడానికి వీలుగా మాత్రమే ఈ కరెంట్ ఖాతా ఉద్దేశించబడింది.

అర్హతలు
భారతదేశంలో నివసించే అందరు భారతీయులు, 18 సంవత్సరాల వయసు నిండినవారు, అంత కన్నా ఎక్కువ వయసు కలవారు ఈ ఖాతా తెరవడానికి అర్హులు. అంతేకాక, వ్యక్తులు, వ్యక్తి యాజమాన్యం కల సంస్ధలు, భాగస్వామ్య సంస్ధలు, వ్యాపార సంస్ధలు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్ధలు, ఆస్తి సంరక్షక సంస్ధలు, అవి భక్త ఉమ్మడి కుటుంబాలు మొదలైనవి కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. కరెంట్ ఖాతాను వ్యక్తి గాగాని, సమిష్టిగాగాని కూడా తెరవవచ్చు.

కనీస డిపాజిట్
బ్యాంకులు 5000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు కనిష్ట డిపాజిటును ఖాతా తెరవడానికి అడుగుతాయి. సామాన్యంగా, జాతీయ బ్యాంకులలో కరెంట్ ఖాతా తెరవడానికి, డిపాజిట్ తక్కువగానే అవసరం ఉంటుంది. ప్రయివేటు బ్యాంకుల్లో బ్యాంకును బట్టి ఇది మారుతుంది.

ఖాతా తెరవడం ఎలా?
కరెంట్ ఖాతాను తెరవడం చాలా సులభం. దరఖాస్తు ఫారమ్ ను పూర్తిగా నింపి, అవసరమైన అధికారిక వ్యక్తిగత మరియు చిరునామా గుర్తింపు పత్రాల వంటి వాటిని జతచేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు అధికారిక ధృవపత్రాల అవసరం వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒకే వ్యక్తి యాజమాన్యం క్రింద ఉండే వ్యాపారానికి కావలసిన ధృవపత్రాలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ప్రైవేట్ భాగస్వామ్య వ్యాపార సంస్ధకు) కు కావలసిన అధికారిక పత్రాలకు తేడా ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications