లాభాలతో కళకళలాడిన దేశీయ మార్కెట్లు
సెన్సెక్స్ 250 పాయింట్లకు పైలాభంతో ముగిసింది. జనవరి డెరేటివ్ కాంట్రాక్టు ముగియనుండటం,వార్షిక బడ్జెట్ ఆశలతో పాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మూడో త్రైమాసిక సానుకూల ఫలితాలతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి.
సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. జనవరి డెరేటివ్ కాంట్రాక్టు ముగియనుండటం, వార్షి క బడ్జెట్ ఆశలతో పాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మూడో త్రైమాసిక సానుకూల ఫలితాలతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 258.24(0.95%) పాయింట్లు లాభపడి 27,375.58 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ 84.30 లాభంతో కీలకమైన 8,400 స్థాయిని అధిగమించి 8,475.80 వద్ద స్థిరపడింది.

సోమవారం సుప్రీంకోర్టు బడ్జెట్ వాయిదాపై వేసిన పిల్ కొట్టేసింది. మరో వైపు నోట్ల రద్దు నేపథ్యంలో కుంటుపడిన వృద్దిని తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్రం కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి మార్కట్లు ఉత్సాహంగానే కదిలి మంచి లాభాలతో మార్కెట్లు కదిలాడాయి. చివరకు రెండు సూచీలు 1 శాతం లాభడ్డాయి.

రంగాల వారీగా చూస్తే లోహరంగం(1.69%), వాహన రంగం(1.67%), ఇంధన రంగం(1.43%), చమురు, సహజ వాయు రంగం(1.31%) లాభపడ్డాయి. మరో వైపు ఐటీ రంగం 0.18% నష్టపోగా, టెక్నాలజీ(0.09%) కుంగింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడిన వాటిని చూస్తే బజాజ్ ఆటో(3.42%), ఎమ్ అండ్ ఎమ్(2.68%), అదానీ పోర్ట్స్(2.41%), కోల్ ఇండియా(1.96%), ఎల్ అండ్ టీ(1.88%) ఉండగా; భారతీ ఎయిర్‌టెల్(1.00%), ఇన్ఫోసిస్(0.7%), హెచ్‌యూఎల్(0.27%), ఐసీఐసీఐ బ్యాంకు(0.14%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications