దేశానికి సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యయ నివేదికే బడ్జెట్. ‘క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు’ అన్న అ
వార్షిక ఆర్థిక నివేదిక లేదా బడ్జెట్
దేశానికి సంబంధించిన వార్షిక ఆదాయ, వ్యయ నివేదికే బడ్జెట్. 'క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు' అన్న అంశం ప్రాతిపదికన పలు అంచనాలు, సవరణలతో బడ్జెట్‌ను రూపొందిస్తారు. బడ్జెట్ అనే మాట 'బొగెట్టీ' అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టే ఈ మాట వాడుకలోకి వచ్చింది. బడ్జెట్‌ను గురించి, అందులో వాడే ముఖ్య పదజాలం అర్థమేంటో వంటి ముఖ్య అంశాలను తెలుసుకుందాం.

ప్రణాళికా వ్యయం:
ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయాన్ని ప్రణాళికా వ్యయంగా పరిగణిస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి.వివిధ మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ లెక్కలకు తుది రూపునిస్తారు.

ప్రణాళికేతర వ్యయం
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటక రంగాలు, విదేశీ వ్యవహారాలు, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, ప్రభ/త‌్వం తీసుకునే రుణాల వడ్డీలు, రుణ చెల్లింపులు ప్రణాళికేతర ఖాతాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.

మూలధన బడ్జెట్
దీన్ని మూలధన ఆదాయం, ఖర్చుల పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. వివిధ వనరుల ద్వారా సమకూరే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి. ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చును మూలధన వ్యయంగా పరిగణిస్తారు.

మూలధన వ్యయం
ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు ఇది. అన్ని ఆదాయ, వ్యయాలు సాధారణంగా క్యాపిటల్ అకౌంట్‌లో వేస్తారు. ఉదాహరణకు ప్రభుత్వం పెట్టుబడుల ఉససంహరణ ద్వారా సేకరించిన నిధులను ఆస్తిగా పరిగణిస్తుంది. వీటిని అమ్మి సొమ్ము చేసుకున్న వివరాలను క్యాపిటల్ ఖాతాలో వేస్తారు.

బడ్జెట్ ఫండ్స్
బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్.. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది.
వసూళ్లు-వ్యయాలు అంటూ రెండు విభాగాలుగా ఈ మూడూ భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటెజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.
కన్సాలిడేటెడ్ ఫండ్: ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్‌లో చేరిపోతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.
కంటింజెన్సీ ఫండ్: ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఉన్నట్లుండి అనుకోకుండా ఏర్పడే ఖర్చులకు వినియోగించడానికి ఈ నిధిలోని ధనాన్ని రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.
పబ్లిక్ అకౌంట్: ఈ అకౌంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ ఖాతా, క్యాపిటల్ ఖాతా
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ ఖాతా. రెండు క్యాపిటల్ ఖాతా. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి వచ్చీ, పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ (రెవెన్యూ ఖాతా) క్యాపిటల్ బడ్జెట్ (క్యాపిటల్ ఖాతా)గా పరిగణించడం జరుగుతుంది.
రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు ఇక వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లోకి చేరతాయి.
క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లో చేరతాయి.

పబ్లిక్ డెట్
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒకొక్క వ్యక్తిపై ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ అంతర్గత అప్పుల్లో ట్రెజరీ బిల్లులు, వేస్ అండ్ మీన్స్, చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించిన సెక్యూరిటీలు ఉంటాయి.

ప్రాథమిక లోటు
రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులు,సబ్సిడీలు వంటివి కలగలిసి ఉంటాయి. ప్రాథమిక లోటు అంటే ప్రభుత్వ ఆదాయం, ఖర్చులను పోల్చి చేసే రెవెన్యూ వ్యయఆదాయాల వ్యత్యాసం. ప్రాథమిక లోటు తగ్గుతుందంటే ప్రభుత్వ ఆదాయ వృద్ది బాగుందని అర్థం. అందుకే బడ్జెట్ పత్రంలో లోటును జీడీపీలో ఎంత శాతం ఉందని చెప్తారు.

ద్రవ్య లోటు
సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు.

రెవిన్యూ లోటు
ప్రభుత్వం తన రెవిన్యూ ఆదాయం కంటే అధికంగా రెవిన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటును రెవిన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెవిన్యూలోటు సున్నాగా ఉండాలి. అలా ఉంటే ప్రభుత్వం చేసిన రెవిన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క. లేకపోతే ఆర్థిక స్థితి ప్రమాదంలో ఉన్నట్లు పరిగణిస్తారు.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ ఆర్థిక సహకారాన్ని పొందుతాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు. వేస్ అండ్ మీన్స్ ద్వారా ప్రభుత్వ సంస్థల ఆదాయ, వ్యయ నిర్వహణ సులువు అవుతుంది.

ట్రెజరీ బిల్లులు
స్వల్పకాలికంగా డబ్బును వాడుకునేందుకు ఉపయోగించే బిల్లులను ప్రభుత్వ పరిభాషలో ట్రెజరీ బిల్లులుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వీటి గడువు ఏడాది లోపే ఉంటుంది. వీటి కోసం ప్రభుత్వం పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరిస్తుంది. మదుపర్లు స్వల్పకాలంలో తమ దగ్గర ఉన్న నిధులను ఇందులో పెట్టుబడులుగా పెట్టవచ్చు. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణీత కాలంలో వేలం వేస్తుంది. వీటికి ఉన్న ఫేస్ వాల్యూ కంటే తక్కువ విలువకే మార్కెట్లోకి విడుదల చేస్తారు. వీటినే ప్రభుత్వ బాండ్ల(డెట్ సెక్యూరిటీ)గా వ్యవహరిస్తారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications