లోహ, చమురు, సహజవాయు, స్థిరాస్తి రంగ షేర్లు రాణించడంతో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 83(0.31%) పాయింట్లు పుంజుకుని 27,117 స్థాయిని చేరుకోగా... నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 8,391 వద్ద
లోహ, చమురు, సహజవాయు, స్థిరాస్తి రంగ షేర్లు రాణించడంతో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 83(0.31%) పాయింట్లు పుంజుకుని 27,117 స్థాయిని చేరుకోగా... నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 8,391 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 8,400కు చేరువలో ముగియడం సెంటిమెంటును బలపరిచింది. ఇందుకు ప్రధానంగా మరో వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న బడ్జెట్‌పై ఆశలే కారణమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జనవరి డెరివేటివ్స్ బుధవారం ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు కొంతమేర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో గత వారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజు దేశీయ మార్కెట్లు దాదాపు 270 పాయింట్ల మేర నష్టపోయాయి. 2017-18 బడ్జెట్ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు పెద్దగా కుదుపునకు గురికాలేదు.

బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో బీఈఎంఎల్(6.40%), యునైటెడ్ స్పిరిట్స్(6.02%), హిందాల్కో(5.75%), శ్రేయి ఇన్‌ఫ్రా(5.73%), సెయిల్(5.15%) ఉండగా; నష్టపోయిన వాటిలో పీఈఎల్(4.15%), దివీస్ ల్యాబ్(3.75%), అమర్‌రాజాబ్యాటరీస్(3.34%), జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ(3.10%), నాట్కోఫార్మా(2.95%) ముందు ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications