కేంద్ర బడ్జెట్ 2017-18 ప్రవేశపెట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్‌ను సమర్పించే తేదీని వాయిదా వేయాలని ఎం.ఎల్ శర్మ కేంద్ర న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖ
కేంద్ర బడ్జెట్ 2017-18 ప్రవేశపెట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్‌ను సమర్పించే తేదీని వాయిదా వేయాలని ఎం.ఎల్ శర్మ కేంద్ర న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 1 వ తేదీన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ ను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఇవాళ పిటిషన్ పై విచారించిన కోర్టు ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టడానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్రాల్లో తరచూ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, వాటివల్ల కేంద్రం తన పనులు మానుకోలేదని తేల్చిచెప్పింది. ఏడాది మొత్తం ఎన్నికలు జరుగుతూనే ఉంటే కేంద్రం తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టకూడదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి తన ఆదేశాల్లో బడ్జెట్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేదేమీ ఉండదన్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పనిని అడ్డుకునే వీల్లేదని అన్నారు. ఏడాది పొడవునా దేశంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున బడ్జెట్ సమర్పణకు వాయిదా వేసేందుకు ఆదేశించలేమని పేర్కొన్నారు. ఎప్పుడూ ఏదో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయన్న న్యాయమూర్తి అంత మాత్రాన బడ్జెట్‌ను వాయిదా వేయాల్సిన అవసరం ఉందా అని శర్మను ప్రశ్నించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications