* ఇప్పటి వరకూ ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ అమలు మొదలవుతుంది.* మొరార్జీ దేశాయ్ ఇప్పటి వరకూ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. అందులో 5 వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర
* భారతదేశంలో ప్రప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటిసారి 1958-59లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఒక ప్రధాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
* 1973-74లో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌ను బ్లాక్ బడ్జెట్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ బడ్జెట్లో లోటు 550 కోట్లకు పెరిగింది.
* సీడీ దేశ్‌ముఖ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేస్తున్న సమయంలో 1951-52లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
* జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మాత్రమే ప్రధానులైనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* దేశంలో మొట్టమొదటి మధ్యంతర బడ్జెట్‌ను ఆర్ కే షణ్ముగం శెట్టి చేతుల మీద ప్రవేశపెట్టడం జరిగింది.
* 1997-98లో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కలల బడ్జెట్‌గా వ్యవహరిస్తారు.
* ఇప్పటి వరకూ ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ అమలు మొదలవుతుంది.
* మొరార్జీ దేశాయ్ ఇప్పటి వరకూ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. అందులో 5 వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్, మూడు ఫైనల్, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆయన డెప్యూటీ ప్రధాని, ఆర్థికమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రవేశపెట్టారు.
* మొరార్జీ దేశాయ్ ఆర్థికమంత్రిగా ఉంటూ 1964,1968 సంవత్సరాల్లో ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
* యూనియన్ బడ్జెట్‌ను ఎప్పుడూ లోక్‌సభలో మొదట ప్రవేశపెడతారు.
* దేశంలో మహిళా ఆర్థికమంత్రిగా పనిచేసింది ఇందిరాగాంధీ ఒక్కరు మాత్రమే. 1970-71 సంవత్సరలో ఆర్థిక శాఖను ఆమే నిర్వహించారు.
* 1947 నుంచి ఇప్పటిదాకా దేశానికి 25 మంది ఆర్థిక మంత్రులుగా పనిచేశారు.



Click it and Unblock the Notifications