ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండటంతో పాటు, అటు ఈ రోజు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ఆందోళన నెలకొందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో దేశీయ
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండటంతో పాటు, అటు ఈ రోజు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ఆందోళన నెలకొందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో దేశీయ మార్కెట్లు బాగా నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్ 1 శాతం పైగా క్షీణించింది.
ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 274 పాయింట్లు నష్టపోయి 27034 వద్ద ముగియగా, నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 8349 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంకు నిరాశజనక ఫలితాలను వెల్లడించడంతో ఒక దశలో ఆ బ్యాంకు షేర్లు 6 శాతానికి పైగా నష్టపోయాయి. ట్రంప్ అనుసరించనున్న విధానాలపై ఆందోళనతో ఐటీ, ఫార్మా కౌంటర్లు డీలాపడ్డాయి. మరోపక్క యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు నిరుత్సాహపరచడంతో బ్యాంకింగ్ కౌంటర్లలో కూడా అమ్మకాలు ఊపందుకున్నాయి.