51 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
మదుపరులు స్థిరంగా పెట్టుబడులను కొనసాగించడం, ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణితో ట్రేడ్ అవుతుండటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఉదయం మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. రోజు మొత్తం సానుకూలంగా కదిలి
లాభాలతో ముగిసిన మార్కెట్లు
మదుపరులు స్థిరంగా పెట్టుబడులను కొనసాగించడం, ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణితో ట్రేడ్ అవుతుండటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఉదయం మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. రోజు మొత్తం సానుకూలంగా కదిలి స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 51 పాయింట్లు పెరిగి 27,309 వద్ద నిలవగా, నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 8,435 వద్ద స్థిరపడింది. అయితే సాంకేతికంగా కీలకమైన 8,450ను దాటలేకపోయింది. ఎన్‌ఎస్‌ఈలో ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 0.5 శాతం స్థాయిలో లాభపడగా.. ఫార్మా, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ 0.6-0.2 శాతం మధ్య నష్టపోయాయి.

బ్లూచిప్స్‌లో బోనస్ జారీ వార్తలతో గెయిల్ అత్యధికంగా దాదాపు 6 శాతం గెయిన్ అయింది. ఈ బాటలో ఐడియా, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఐషర్, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఐటీసీ 1.5నుంచి 3 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క యాక్సిస్, అరబిందో, లుపిన్, సన్ ఫార్మా, జీ, అల్ట్రాటెక్, విప్రో, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ 0.6-1.6 శాతం మధ్య నష్టపోయాయి.


Click it and Unblock the Notifications