పాలసీ స్వాధీనం అన్ని రకాల పాలసీలకు వర్తించదు. ఎండోమెంట్, యూలిప్స్ లాంటి జీవిత కాలం వర్తింపజేసే పాలసీలను స్వాధీనపర్చుకునే వీలుంటుంది. టర్మ్ పాలసీలో పాలసీ గడువులోగా ప్రమాదం జరిగితే బీమా హామీ మొత్తాన్
స్వాధీన విలువ (సరెండర్ వాల్యూ)
మెచ్యూరిటీ తేదీ లేదా బీమా ఉద్దేశించిన సంఘటన అవ్వక ముందే పాలసీదారుడు తన పాలసీని ముగించాలని కోరుకుంటే బీమా కంపెనీ పాలసీదారుకు అందించే సొమ్మునే స్వాధీన విలువ అంటారు.
సాధారణంగా ఒక పాలసీని తీసుకున్నాక పాలసీదారుడు దాన్ని స్వాధీనపర్చకపోవడమే మేలు ఎందుకంటే హామీ ఇచ్చిన సొమ్ము కంటే స్వాధీన విలువ తక్కువ ఉంటుంది. అయితే తీసుకున్న పాలసీ తన అవసరాలకు తగినది కాదని భావించినప్పుడు స్వాధీనం పరచడమే మంచిది. ఒక్కసారి పాలసీని స్వాధీనం చేశాక బీమాకు వర్తించే ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి.
పాలసీ కాలావధి, చెల్లించిన ప్రీమియంలు, ప్రీమియం చెల్లించిన కాలావధిని పరిగణలోకి తీసుకొని ఇందుకు కొంత స్వాధీన రుసుమును వేసి స్వాధీన విలువకు తగ్గ సొమ్మును పాలసీదారుకు అందజేస్తారు.
బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) ఇటీవల సూచించిన విధంగా అయిదేళ్లు వరుసగా ప్రీమియం చెల్లించిన వారికి స్వాధీన రుసుము వర్తింపజేయవద్దని బీమా కంపెనీలకు
నిర్దేశించింది.
ఓ పాలసీని స్వాధీనం చేసుకోవాలంటే కనీసం మూడేళ్ల వరకు వరుసగా ప్రీమియంలు చెల్లించి ఉండాలి.
మూడేళ్ల తర్వాత ఎప్పుడైనా పాలసీని స్వాధీనపర్చుకోవాలని పాలసీదారు భావిస్తే ఇంతవరకు చెల్లించిన ప్రీమియంలను దానికి స్వాధీన రుసుమును కలిపి ఎంత వరకు చెల్లించాలో 'పెయిడ్ అప్ వాల్యూ' గా లెక్కించి అందజేస్తారు.
పాలసీ స్వాధీనం అన్ని రకాల పాలసీలకు వర్తించదు. ఎండోమెంట్, యూలిప్స్ లాంటి జీవిత కాలం వర్తింపజేసే పాలసీలను స్వాధీనపర్చుకునే వీలుంటుంది. టర్మ్ పాలసీలో పాలసీ గడువులోగా ప్రమాదం జరిగితే బీమా హామీ మొత్తాన్ని ఇస్తారు కాబట్టి వీటిని స్వాధీనపర్చుకునే అవకాశం లేదు.

సాధారణంగా బీమా కంపెనీలు పాలసీలపై రుణాలు ఇస్తుంటాయి. ఎప్పుడైనా పాలసీ నుంచి పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకున్నా లేదా పాలసీపై రుణాలు తీసుకున్నా దాని ప్రభావం స్వాధీన విలువపై ఉంటుంది. రుణాలు తీసుకుంటే స్వాధీన విలువ తగ్గుతుందన్నమాట.
స్వాధీన విలువను లెక్కించేటప్పుడు పాలసీపై జమ అయ్యే బోనస్‌ను కూడా కలిపి ఇస్తారు. అంతవరకు ప్రీమియంల రూపంలో చెల్లించిన పెట్టుబడులను స్వాధీన విలువగా అందజేస్తారు. పెట్టుబడి బీమా కలిసి ఉన్న ఎండోమెంట్ పథకాలు, మనీబ్యాక్ పాలసీలు, యూలిప్ లాంటి పాలసీలకు మాత్రమే స్వాధీన వెసులుబాటు ఉంటుంది.
కొన్ని యూలిప్స్‌లో ఒక ఏడాది తర్వాత కూడా స్వాధీనపర్చుకునే వీలుంటుంది. అయితే స్వాధీన సొమ్మును మాత్రం మూడేళ్ల తర్వాతే చెల్లిస్తారు.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications