ఎయిర్ ఏషియా ద్వారా విమాన‌ ప్ర‌యాణాలు అతిచౌక‌గా, జ‌న‌వ‌రి 22 చివ‌రి తేదీ

విదేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఏషియా బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకే విమానయన సదుపాయం కల్పిస్తూ

విదేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఏషియా బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకే విమానయన సదుపాయం కల్పిస్తూ.... చౌక ధరల యుద్ధానికి తెరతీస్తున్న తరుణంలో ఎయిర్‌ ఏషియా మరోమారు చవకైన ఆఫర్‌ ప్రకటించింది. రూ. 407లకే విమానంలో ప్రయాణించే అతి త‌క్కువ టికెట్ ధరల్ని ప్రకటించింది. "2017 ఎర్లీ బర్డ్ సేల్" అనే ప్రచార పథకంలో భాగంగా ఈ టిక్కెట్లను అందిస్తోంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 22 న ముగుస్తుంద‌ని ఎయిర్ ఏషియా తెలిపింది. అలాగే ఈ ఆఫర్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లతో మే 1, 2017- ఫిబ్రవరి 6, 2018మధ్య ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది.

Air Asia Early Bird Sale and Base fare starts from 999 rupees

ఎయిర్ఏషియా తాజా ఆఫర్ కింద గౌహతి -ఇంఫాల్ రూ. 407, గోవా-హైదరాబాద్ రూ. 877, హైదరాబాద్-బెంగళూరు రూ.938 , జైపూర్-పూణే రూ. 2.516, పుణే- బెంగళూరు రూ. 821 బెంగళూరు-హైదరాబాద్ రూ. 663 ధరలను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ పరిధిలోకి ఇతర కొన్ని మార్గాలలో కూడా ఉన్నట్టు తెలిపింది.
మ‌రిన్ని ఆఫ‌ర్ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Air Asia Early Bird Sale and Base fare starts from 999 rupees

ఇతర విమాన‌ సంస్థలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ ఏషియా కూడా తాజా ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశీయ మార్కెట్లో విమాన ప్రయాణంలో నెలకొన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తగ్గింపు ఆఫర్లతో ప్రయాణికులను అన్ని విమాన సంస్థ‌లు త‌మ విధానాల‌తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియా, గోఎయిర్, స్పైస్ జెట్ , ఇండిగో సంస్థ కొత్త సంవత్సర రాయితీల‌ను ప్రకటించడంతోపాటు భారీ విస్తరణకు దిగుతున్న సంగతి తెలిసిందే. అసోచామ్ ఐఎటిఎ ప్రకారం నవంబర్ 2016 లో దేశీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 22.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+