మౌలిక వ‌స‌తులు, గ్రామీణాభివృద్దే ల‌క్ష్యంగా సాగిన 2016-17 బ‌డ్జెట్

ప్ర‌స్తుతం సామాన్యులు సైతం బ‌డ్జెట్ వార్త‌లు, స‌మాచారాన్ని ఆస‌క్తిక‌రంగా చూస్తున్నారు. ఈ తరణంలో అంద‌రికీ ఉపయోగపడేలా బడ్జెట్ కేటాయింపులను గుడ్‌రిట‌ర్న్స్ మీ కోసం విశ్లేషించింది.

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, మౌలిక వ‌స‌తులు, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర బ‌డ్జెట్ సాగింది 2016-17 కేంద్ర బడ్జెట్. వచ్చే మూడేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, పేదల ఆరోగ్యం కోసం రూ.లక్ష బీమా, స్వచ్ఛభారత్, ఉపాధి హామీ పథకాలకు భారీ కేటాయింపులు వంటి వాటితో వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016,ఫిబ్రవరి 29న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్ర‌స్తుతం సామాన్యులు సైతం బ‌డ్జెట్ వార్త‌లు, స‌మాచారాన్ని ఆస‌క్తిక‌రంగా చూస్తున్నారు. ఈ తరణంలో అంద‌రికీ ఉపయోగపడేలా బడ్జెట్ కేటాయింపులను గుడ్‌రిట‌ర్న్స్ మీ కోసం విశ్లేషించింది.

1. స‌క్ర‌మంగా ప‌న్ను చెల్లించే వారికి నిరాశే

1. స‌క్ర‌మంగా ప‌న్ను చెల్లించే వారికి నిరాశే

సింహ భాగం ప‌న్ను చెల్లింపుదార్ల‌ను నిరాశ‌ప‌రిచేలా ఆదాయ‌పు ప‌న్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయ‌లేదు. నిబ‌ద్ద‌త‌తో పన్ను చెల్లించే మ‌ధ్య త‌ర‌గతి వారికి, ఉద్యోగుల‌కు పెద్దగా ప్రయోజనం కల్పించలేదనే చెప్పాలి. ఆదాయపు పరిమితిని స‌వ‌రించ‌డం, శ్లాబుల్లో మార్పులు తదితరాల జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. అల్పాదాయ వర్గాలకు మాత్రం రూ.3 వేల అదనపు పన్ను రాయితీ కల్పించడం ఊరట. రూ.2,50,000 ఆదాయ పరిమితిలో ఎలాంటి మార్పూ చేయలేదు.

2. పన్ను రాయితీ:

2. పన్ను రాయితీ:

ఆదాయ పన్ను చట్టం 'సెక్షన్ - 87ఎ' ప్రకారం పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్నప్పుడు, చెల్లించాల్సిన పన్నులో రూ.2 వేల వరకూ రిబేటు క‌ల్పించారు. 2016-17 బడ్జెట్‌లో దీన్ని రూ.5 వేలకు పెంచారు. అల్పాదాయ వ‌ర్గాల వారికి అందించిన ఒకే ఒక‌ ప్రయోజనం ఇదొక్కటే అని చెప్పాలి. దీనివల్ల దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని విత్త‌ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి పన్ను వర్తించే ఆదాయం రూ.3,50,000 ఉన్నప్పుడు, మామూలుగా అయితే ఆ వ్య‌క్తి రూ.10 వేల పన్ను కట్టాలి. కొత్తబడ్జెట్ లెక్కల ప్రకారం ఇప్పుడు అతను చెల్లించాల్సిన పన్ను రూ.5 వేలుగా మార్పు చేశారు. మొత్తంగా చూస్తే నెల‌కు రూ. 41 వేలకు లోపు ఆదాయం ఉన్నవారికి స్వ‌ల్ప ఊర‌ట‌లు ల‌భిస్తాయి. దానికి పైబ‌డి ఆదాయం ఉన్న‌వారికి రిబేటు వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నం లేదు.

3. ఇంటి అద్దె భ‌త్యం(హెచ్ఆర్‌ఏ) లేనివాళ్ల కోసం:

3. ఇంటి అద్దె భ‌త్యం(హెచ్ఆర్‌ఏ) లేనివాళ్ల కోసం:

కొంతమంది ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం లభించదు. ఇలాంటివారు సెక్షన్ 80(జీ)(జీ) ప్ర‌కారం రూ.24 వేల వరకూ లేదా వాస్తవంగా చెల్లించిన అద్దె మొత్తం ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ‌ ఉంటే.. రెండింటిలో ఏది తక్కువయితే అంత మొత్తానికి మినహాయింపు పొంద‌వ‌చ్చు. 2016 బడ్జెట్‌లో దీన్ని రూ.60 వేలకు పెంచారు. హెచ్ఆర్‌ఏ=హౌస్ రెంట్ అల‌వెన్సు

4. కొత్తగా ఇంటి రుణం:

4. కొత్తగా ఇంటి రుణం:

కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారికి ఇప్పుడు ఉన్న దానికి అదనపు మినహాయింపు కల్పించారు. ఇప్ప‌టిదాకా ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం గృహరుణంపై వడ్డీకి రూ.2 లక్షల వరకూ మినహాయింపు లభిస్తోంది. దీనికి అదనంగా రూ.50 వేల వరకూ వడ్డీ మినహాయింపును ప్రతిపాదించారు. ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, రుణం రూ.35 లక్షల లోపు ఉండాలి.

5. చిన్న వ్యాపారులకు ప‌న్ను ప‌రిమితి పెంపు:

5. చిన్న వ్యాపారులకు ప‌న్ను ప‌రిమితి పెంపు:

సెక్షన్ 44(ఏ)(డీ) కింద రూ.కోటి వరకూ వార్షిక అమ్మకాలు ఉన్నవారు ఎలాంటి పుస్తకాలూ నిర్వహించక్కర్లేదు. ఇప్పుడు ఈ పరిమితిని పెంచి రూ.2 కోట్లుగా నిర్ణ‌యించారు. ప్రతిపాదిత బడ్జెట్‌లో రూ.50 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి సైతం ఈ సెక్షన్‌ను వర్తింపజేశారు.

డివిడెండ్లపై: ప్రస్తుత విధానంలో డివిడెండ్లపై ఎలాంటి పన్నూ లేదు. కొత్త బ‌డ్జెట్ ప్ర‌కారం ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ డివిడెండు పొందినప్పుడు 10% పన్ను చెల్లించాలి.

6.కార్పొరేట్ పన్నులు:

6.కార్పొరేట్ పన్నులు:

కొత్త బడ్జెట్‌లో కార్పొరేట్ సంస్థ‌ల‌కు పెద్ద‌గా ప్రయోజనాలేమీ కల్పించలేదు. చిన్న వ్యాపార సంస్థలకు మాత్రం స్వ‌ల్ప పన్ను రాయితీల‌ను ప్ర‌క‌టించారు. మార్చి 1, 2016 తర్వాత నమోద‌యి, ప్రారంభమయ్యే తయారీ సంస్థలకు వర్తించే పన్ను శాతాన్ని 25 శాతానికి తగ్గించారు. స‌ర్‌చార్జీ మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. ఆ సంస్థ పెట్టుబడి ఆధార మినహాయింపులుగానీ, అదనపు తరుగుదలలు గానీ కోరకూడదనే ష‌ర‌తు విధించారు. వార్షిక టర్నోవర్ రూ.5 కోట్లలోపు ఉన్న కంపెనీలు 29% ఆదాయ పన్ను చెల్లించాలని ప్ర‌క‌టించారు.

7. అంకురాల‌కు ప‌ట్టం:

7. అంకురాల‌కు ప‌ట్టం:

అంకుర సంస్థలకు మొదటి ఐదేళ్లలో మూడేళ్లపాటు ఎలాంటి పన్నులూ చెల్లించనక్కర్లేకుండా 100% పన్ను రాయితీ ఇచ్చారు. యువ జ‌నాభాతో దూసుకెళుతున్న భార‌త్‌కు ఇది ఊపునిచ్చే అంశం. అయితే ఏప్రిల్, 2016 నుంచి మార్చి, 2019 మధ్య కాలంలో ప్రారంభమయ్యే సంస్థలకే ఇది వర్తిస్తుంది. నమోదుకాని కంపెనీల్లో పెట్టుబడుల దీర్ఘకాలిక మూలధన రాబడి వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్ల కాలానికి తగ్గించారు. బ్యాంకింగేతర రుణ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు వసూలు కాని, రాని బాకీలపై మినహాయింపు ప్రతిపాదించారు. ఈ మినహాయింపు వార్షికాదాయంలో 5 శాతం మేరకే అనుమతిస్తారు.

8. పింఛను పథకాల్లో:

8. పింఛను పథకాల్లో:

జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో మదుపు చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకునేప్పుడు 40 శాతం మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగతా 60 శాతానికి పన్ను చెల్లించాలి. గుర్తింపు పొందిన ప్రావిడెంట్‌ఫండ్‌ల‌లో ఏప్రిల్ 1, 2016 తర్వాత జమచేసే మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఖాతాదారుడి వారసులు ఈ మొత్తాన్ని పొందినప్పుడు పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఏదైనా సంస్థ‌లో కొత్తగా ఉద్యోగి ఈపీఎఫ్‌(భ‌విష్య నిధి సంస్థ‌)లో చేరితే... మూడేళ్లపాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను (జీతంలో 8.33 శాతం) కేంద్రమే ఈపీఎఫ్‌కి జమ చేస్తుంది. అయితే ఉద్యోగి జీతం రూ.15,000 దాటి ఉండకూడదు. దీని వల్ల జీతంలో కనీసం 8.33 శాతం ఈపీఎఫ్‌కి జమచేయాలన్న నిబంధన నుంచి కంపెనీలకు మూడేళ్ల పాటు ఊరట లభిస్తుంది. ఉద్యోగికీ లాభం ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది.

9. ఆదాయం కోటి దాటితే:

9. ఆదాయం కోటి దాటితే:

రూ.కోటికి మించి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలపై 12% సర్‌ఛార్జి విధిస్తున్నారు. కొత్తబడ్జెట్ ప్రకారం ఇది 15% కానుంది. మూలం వద్ద పన్ను వసూలు (టాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్) చేసే వాటిలో అదనంగా చేర్చినవి...

రూ.10 లక్షలకు మించిన కారు కొనుగోలు చేసినప్పుడు మూలం వద్ద 1% వసూలు చేస్తారు.

రూ.2 లక్షలకు మించి నగదు కొనుగోళ్లు జరిపినా, సేవలు పొందినా 1% పన్ను అదనం.

10. పట్టణాలకు ప్రాధాన్య‌త‌

10. పట్టణాలకు ప్రాధాన్య‌త‌

దేశంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. 'అటల్ పునరుజ్జీవన, పట్టణ రూపాంతీకరణ' (అమృత్) పథకానికి రూ.4,091 కోట్లను, 'ఆకర్షణీయ నగరాల'కు (స్మార్ట్‌సిటీలకు) రూ.3,205 కోట్లను కేటాయించింది. రెండుపథకాలకు కలిపి మొత్తంగా చూస్తే ఇది రూ.7,296 కోట్లుగా ఉంది.

న‌గ‌రాలు ఇక‌పై ఆకర్ష‌ణీయం

'స్మార్ట్‌సిటీ'ల కింద దేశవ్యాప్తంగా 100 నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. దీనికి సంబంధించిన విధివిధానాలను గతేడాది జూన్‌లో కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. వీటి ఆధారంగా తొలి 20 నగరాల పేర్లను గతనెల ప్రకటించింది. రెండు, మూడోదశల్లో 40 చొప్పున మిగిలిన 80 నగరాల పేర్లను వెల్లడించనుంది. ఒక్కో నగరానికి ఐదేళ్లవ్యవధిలో రూ.500 కోట్లను అందజేస్తారు. ఆయారాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.500 కోట్లను ఈ నగరాల అభివృద్ధికి కేటాయించాల్సి ఉంటుంది. 'ఆకర్షణీయ నగరాల' పథకంలో భాగంగా ఆయానగరాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, సరసమైన ధరల్లో గృహవసతి, ఇంటర్నెట్ అనుసంధానం, ఐటీసేవలు, డిజిటలీకరణ, ఈ-పాలనలో పౌరులకు భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ, శాంతిభద్రతలు, విద్య, వైద్యాలకు ప్రాధాన్యతనిస్తారు.

ప్రవేశపెట్టిన పథకాలు

పట్టణాల అభివృద్ధికి కేంద్రం ఇప్పటివరకూ తీసుకొచ్చిన పథకాలు.. ఆకర్షణీయ నగరాలు, అమృత్, వారసత్వ నగరాల అభివృద్ధి పథకం (హృదయ్), చిన్న - మధ్య తరహా పట్టణాల అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల పట్టణాభివృద్ధి, మెట్రోరైలు ప్రాజెక్టులు. మొత్తంగా పట్టణాభివృద్ధికి వచ్చే 15 ఏళ్లలో రూ.40 లక్షల కోట్లు అవసరమని అంచనా.

అమృత్

ఈ పథకంలో భాగంగా పట్టణాల్లో ప్రాథమిక సౌకర్యాలను నెలకొల్పుతారు. వీటిలో తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా ముఖ్యమైనవి. 18 రాష్ట్రాల్లోని 474 పట్టణాలను అమృత్ కింద గుర్తించారు.

నగరాలు, పట్టణాలు: 7,935

మొత్తం పట్టణ జిల్లాలు: 9

అమృత్‌కు రూ.4,091 కోట్లు

స్మార్ట్‌సిటీలకు రూ.3,205 కోట్లు

కేంద్ర బడ్జెట్లో పట్టణాభివృద్ధి శాఖకు కేటాయింపులు దాదాపు 39% మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,160 కోట్లు కేటాయిస్తే, వచ్చే ఏడాది అది రూ.21,000 కోట్లుగా ఉంటుంది. దీనిలో పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ పనులకు రూ.2300 కోట్లు కేటాయించారు. ఆకర్షణీయ నగరాలకు ప్రస్తుత సంవత్సరం రూ.820 కోట్లు కేటాయిస్తే, కొత్త బడ్జెట్లో ఎకాఎకి రూ.3205 కోట్లకు పెంచారు. అటల్ పట్టణ రూపాంతరీకరణ, పునరుజ్జీవన పథకం (అమృత్) కోసం రూ.4090 కోట్లు, వివిధ నగరాల్లో మెట్రో పనులకు రమారమి రూ.10,000 కోట్లు కేటాయించారు. మెట్రో నిధుల్లో సింహభాగం (రూ.5400 కోట్లు) దిల్లీకి వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు రూ.106 కోట్లు ఇచ్చారు. గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలకు రూ.5400 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+