అంచ‌నాల‌ను అందుకున్న టీసీఎస్ : టాటా గ్రూప్ కొత్త ఛైర్మ‌న్‌గా చంద్ర‌శేఖ‌ర‌న్‌

దేశీయ ఐటీ దిగ్గ‌జం తృతీయ త్రైమాసిక ఫ‌లితాల్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించింది. టిసిఎస్ క్యూ3 ఎబిటా 26శాతంగా నమోదు అయింది. రూ.7733కోట్ల ఎబిటా సాధించిన ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ రూ.6778కోట్ల నికరలాభం సాధించి

దేశీయ ఐటీ దిగ్గ‌జం తృతీయ త్రైమాసిక ఫ‌లితాల్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించింది.
టిసిఎస్ క్యూ3 ఎబిటా 26శాతంగా నమోదు అయింది. రూ.7733కోట్ల ఎబిటా సాధించిన ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ రూ.6778కోట్ల నికరలాభం సాధించింది.
క్యూ3లో రూ 29,735కోట్ల ఆదాయం ప్రకటించిన టీసీఎస్ ప్రతి షేర్‌కి రూ.6.50 డివిడెండ్ ప్రకటించింది. కరెన్సీ వృధ్ధి 2శాతం నమోదయింది. ఈ త్రైమాసికంలో రూ. 6432 కోట్ల లాభాన్ని న‌మోదు చేయ‌గ‌ల‌ద‌ని విశ్లేష‌కులు ఊహించారు. ఒక వైపు మిస్త్రీ వివాదం, మ‌రో వైపు హెచ్‌-1బీ వీసాలపై ఆందోళ‌న‌లు నెల‌కొన్న‌ప్ప‌టికీ ఫలితాల్లో టీసీఎస్ మెరిసింది. టాటా గ్రూపు కొత్త ఛైర్మ‌న్‌గా చంద్ర‌శేఖ‌ర్‌ను నియ‌మించ‌నున్న నేప‌థ్యంలో టీసీఎస్‌కు నూత‌న సీఈవోను ప్ర‌క‌టించారు.

మ‌రిన్నిప‌రిణామాల‌ను కింద చ‌ద‌వండి

టీసీఎస్ కొత్త సీఈవోగా రాజేష్ గోపినాథ‌న్

టీసీఎస్ కొత్త సీఈవోగా రాజేష్ గోపినాథ‌న్

రాజేష్ గోపినాథ‌న్ త‌న వృత్తి జీవితాన్ని టీసీఎస్‌లో 2001లో ప్రారంభించారు. 2013 ఫిబ్ర‌వ‌రి నెల‌లో సంస్థ సీఎఫ్‌వోగా నియ‌మితుల‌య్యారు. అంత‌కుముందు ఈయ‌న కంపెనీ బిజినెస్ ఫైనాన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. కంపెనీ నిర్వ‌హ‌ణా యూనిట్ల‌లో ఆర్థిక నిర్వ‌హ‌ణ బాగా ఉండ‌టానికి కార‌ణ‌మైన వారిలో ఈయ‌న ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆయ‌న నిర్వ‌హించిన బాధ్య‌త‌ల్లో ఆర్థిక ప్ర‌ణాళిక‌, నిర్వ‌హ‌ణ‌, రెవెన్యూ, మార్జిన్ల నిర్వ‌హ‌ణ వంటివి ఉన్నాయి. ఆయ‌న విద్యార్హ‌త‌ల గురించి చూస్తే ఎన్ఐటీ త్రిచి నుంచి ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ప‌ట్టభ‌ద్ర‌త సాధించారు. త‌ర్వాత ఐఐఎమ్ అహ్మ‌దాబాద్ నుంచి పోస్ట్ గ్రాడడ్యుయేట్ డిప్లోమో ఇన్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు.

ఎన్‌.చంద్ర‌శేఖ‌ర‌న్

ఎన్‌.చంద్ర‌శేఖ‌ర‌న్

టాటా క‌న్స‌ల్టెన్సీ సీఈవోగా ఎన్‌.చంద్ర‌శేఖ‌రన్ ప‌నిచేస్తున్నారు. చాలా కార‌ణాల చేత ఈయనేటాటా గ్రూప్ ఛైర్మ‌న్ అయ్యారు. మిగిలిన వారితో పోలిస్తే ఆయ‌న ఇంకా కాస్త వ‌య‌సులో చిన్న వ్య‌క్తిగా, స‌మ‌గ్ర విలువ‌లు క‌లిగి, టీసీఎస్‌ను లాభాల దిశ‌గా న‌డిపించ‌డం వంటి సానుకూల‌త‌ల‌ను క‌లిగి ఉన్నారు. టీసీఎస్‌ను చాలా ఏళ్ల పాటు విజ‌య‌వంతంగా మార్గ‌నిర్దేశ‌నం చేయ‌డంతో పాటు టాటా గ్రూపు విలువ‌ను బాగా అవ‌పోశ‌న ప‌ట్టి ఉన్నారు.

అయితే ప్ర‌తికూల‌త‌ను చూస్తే ఇంతకుముందు లాగా టీసీఎస్ త్రైమాసిక ఫ‌లితాల్లో మెరుగుద‌ల‌ను ఆశించినంత‌గా క‌న‌బ‌ర‌చ‌డం లేదు. ప్ర‌తి త్రైమాసిక ఫ‌లితాల్లో ఆ ప‌రిస్థితి దిగ‌జారుతోంది. ఈ త్రైమాసికం మాత్రం అంచనాల‌కు త‌గ్గ‌ట్లుగా రాణించింది. టీసీఎస్‌కు ప్ర‌స్తుతం చాలెంజింగ్ టైమ్‌గా చెప్పుకోవ‌చ్చు. అందుకే టీసీఎస్‌ను ప్ర‌స్తుతం వృద్ది ప‌థంలో న‌డిపించాలంటే ఆయ‌న అవ‌స‌రం ఉంది. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ టాటా గ్రూప్ యాజన‌మాన్యం ఈయ‌న వైపు మొగ్గుచూపింది.

 2016లో ఐటీలో శ‌క్తిమంత‌మైన సంస్థ‌గా టీసీఎస్‌

2016లో ఐటీలో శ‌క్తిమంత‌మైన సంస్థ‌గా టీసీఎస్‌

ఐటీ సేవల రంగంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)నిలిచింది. అంతర్జాతీయంగా బ్రాండ్ విలువను గణించే సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌, 2016కు సంబంధించి వార్షిక జాబితాను ప్రచురించింది. ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టీసీఎస్ అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించింది. నిబద్ధత, ఉద్యోగుల సంతృప్తి, కార్పోరేట్ గౌరవం, ఉద్యోగుల సంతోషం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

టాటా క‌న్సల్టెన్సీని దిగ్గ‌జంగా తీర్చిదిద్దిన చంద్ర‌శేఖ‌ర‌న్‌

టాటా క‌న్సల్టెన్సీని దిగ్గ‌జంగా తీర్చిదిద్దిన చంద్ర‌శేఖ‌ర‌న్‌

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్టోబర్, 2009లో చంద్రశేఖరన్‌‌ను కంపెనీ సీఈఓగా ప్రకటించింది. ఆయన సీఈఓ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ టర్నోవర్ రూ.30,0029 కోట్ల నుంచి రూ.94,648 కోట్లకు పెరిగింది.

టీసీఎస్ సీఈవో నుంచి టాటా గ్రూప్ ఛైర్మ‌న్ వ‌ర‌కూ

టీసీఎస్ సీఈవో నుంచి టాటా గ్రూప్ ఛైర్మ‌న్ వ‌ర‌కూ

టాటా గ్రూప్‌ తదుపరి ఛైర్మన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ను బోర్డు స‌మావేశంలో ఏక‌గ్రీవంగా ఎన్నుకుని నియ‌మించారు. అక్టోబర్‌లో సైరస్‌ మిస్త్రీ తొలగింపు తర్వాత ఆ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిపెద్ద పొరుగుసేవల సంస్థ అయిన టీసీఎస్‌కు సీఎండీగా ఉన్న చంద్రశేఖరన్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు. ఈ మేరకు టాటా గ్రూపు ఈరోజు అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశం అనంతరం కొత్త ఛైర్మన్‌ను ప్రకటించారు. 2009 నుంచి టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖరన్‌ 1987లో టీసీఎస్‌లో చేరారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+