హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రోబోట్ బ్యాంకింగ్ సేవలు
భారతదేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీలో రోబోట్ సేవలు ప్రారంభించింది. దేశంలోనే బ్యాంకింగ్ రంగంలో మొట్టమొదటి సారి హ్యూమనాయిడ్ ద్వారా బ్యాంకింగ్ సేవలు తామే అందించినట్లు
మన భారతదేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీలో రోబోట్ సేవలు ప్రారంభించింది. దేశంలోనే బ్యాంకింగ్ రంగంలో మొట్టమొదటి సారి హ్యూమనాయిడ్ ద్వారా బ్యాంకింగ్ సేవలు తామే అందించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకటించింది. కోచికి చెందిన అసిమోవ్ రోబోటిటిక్స్ ఈ రోబోట్‌ను తయారుచేసింది.

జపాన్ లోని టోకియో మిత్సుబిషీ బ్యాంకు నౌ పెప్పర్ పేరిట రోబోట్ సేవలను ప్రారంభించింది. జపాన్ అందించిన సహకారంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కొత్తగా రోబోట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముంబయి నగరంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో మొట్టమొదటిసారి రోబో సాయంతో సీనియర్ సిటీజన్లకు సేవలు అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఈ కొత్త రోబో రిసెప్షనిస్టుగా సేవలందిస్తుందని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి.
అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు గాను ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేథస్సు)ను ఉపయోగించే దిశగా యోచిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. స్టార్టప్‌ల భాగస్వామ్యంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), వర్చువల్ రియాల్టీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పరిశీలిస్తున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. దీనికి సంబంధించి 100 ఎంట్రీలు రాగా 35 స్టార్టప్‌లు తమ ఆలోచనలను పంచుకున్నాయి. ఇందులో బ్యాంకుతో కలిసి పనిచేసేందుకు ఐదింటిని ఎంపిక చేశారు.


Click it and Unblock the Notifications