For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోలు బంకుల్లో చెల్లింపుల‌కు మొబిక్విక్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

ఒక‌ప‌క్క పెట్రోలు బంకుల్లో చెల్లింపుల‌కు మ‌ర్చంట్ డిస్కౌంట్ చార్జీల‌ను ఎవ‌రు భ‌రించాల‌నే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న కొన‌సాగుతుండ‌గా మొబిక్విక్ అంద‌రికీ స్వాంత‌న చేకూర్చే నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. తమ మొబైల్‌ వ

|

ఒక‌ప‌క్క పెట్రోలు బంకుల్లో చెల్లింపుల‌కు మ‌ర్చంట్ డిస్కౌంట్ చార్జీల‌ను ఎవ‌రు భ‌రించాల‌నే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న కొన‌సాగుతుండ‌గా మొబిక్విక్ అంద‌రికీ స్వాంత‌న చేకూర్చే నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. తమ మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా పెట్రోలు బంకులు, ఎల్‌పీజీ గ్యాస్‌ చెల్లింపులను చేస్తే సర్‌ఛార్జి వసూలు చేయబోమని దేశీయ మొబైల్‌ వ్యాలెట్ తెలిపింది. 'పెట్రోల్‌ బంకులు, ఎల్‌పీజీ చెల్లింపులను మొబిక్విక్‌ ద్వారా చేసే వినియోగదారులు ప్రయోజనాలు పొందవచ్చు. వారి నుంచి ఎలాంటి సర్‌ఛార్జి వసూలు చేయం. డిజిటల్‌ చెల్లింపులను కొనసాగించేందుకు ప్రజలను ప్రోత్సహించ‌డంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం' అని మొబిక్విక్ సహ వ్యవస్థాపకులు ఉపాసన థాకూ ఓ ప్రకటనలో చెప్పారు. మీరు బిల్లులు చెల్లించేందుకు ప‌నికొచ్చే ఈ వ్యాలెట్లు వాడారా?

 పెట్రోలు బంకుల్లో చెల్లింపుల‌కు మొబిక్విక్ బంప‌ర్ ఆఫ‌ర్‌!

దేశంలో ఇర‌వైకి పైగా నగరాల్లోని వివిధ పెట్రోల్‌ బంకుల్లో మొబిక్విక్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ సహా అనేక నగరాల్లోని ఇండియన్‌ ఆయిల్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం బంకుల్లో ఈ స‌దుపాయం క‌ల్పించారు. వీటితో పాటు ఇండియన్‌, భారత్‌ గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌లకు మొబిక్విక్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

Read more about: mobikwik wallet
English summary

పెట్రోలు బంకుల్లో చెల్లింపుల‌కు మొబిక్విక్ బంప‌ర్ ఆఫ‌ర్‌! | MobiKwik offers zero surcharge at petrol pumps and LPG payments

Domestic mobile wallet platform MobiKwik on Tuesday waived surcharge on payments at petrol pumps and LPG gas payments.“The announcement of zero surcharge on all petrol pumps and LPG transactions will benefit consumers and will motivate them to continue using digital payments,” said Upasana Taku, Co-founder of MobiKwik, in a statement.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X