రూ. 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విచారణ జరుపుతున్న పార్లమెంటుకు చెందిన ప్రజా పద్దుల కమిటీ (పిఏసి) కసర్తతును వేగవంతం చేసింది. నోట్ల రద్దు ప్రక్రియపై రిజర్వ
రూ. 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విచారణ జరుపుతున్న పార్లమెంటుకు చెందిన ప్రజా పద్దుల కమిటీ (పిఏసి) కసర్తతును వేగవంతం చేసింది. నోట్ల రద్దు ప్రక్రియపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కొన్ని ప్రశ్నలను పంపించడమే కాకుండా ఈ నెల 20న కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌ను పిఏసి కోరినట్లు కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కెవి థామస్ చెప్పారు.

నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో నెలకొన్న నగదు కొరత, పాత నోట్ల డిపాజిట్లపై రోజుకో కొత్త నిబంధన తీసుకురావడం కారణాలతో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై ప్రతిపక్షాలతో సహా అన్ని వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరో పార్లమెంటు కమిటీ ముందు కూడా ఆయన హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంక్ తిరిగొచ్చిన కరెన్సీ విలువ ఎంత, అందుల్లో నల్లధనం ఎంత, ఇప్పటివరకు విడుదల చేసిన కొత్త కరెన్సీ మొత్తం ఎంత అనే వివరాలు తెలియజేయాలని పిఏసీ ఉర్జిత్ పటేల్‌ను కోరిందని థామస్ వెల్లడించారు. నగదురహిత లావాదేవీలకు దేశం ఏ విధంగా సన్నద్ధం అవుతూ ఉందో కూడా తెలియజేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. డిసెంబర్‌లోనే తాము ఆర్‌బిఐ గవర్నర్‌ను పిలవాలని అనుకున్నామని, అయితే ప్రధాని 50 రోజులు సమయం అడిగినందున జనవరికి వాయిదా వేసుకున్నామన్నారు. దీనికి రాజకీయ రంగు పులమడం తమకు ఇష్టం లేదని కూడా ఆయన తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications