119 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
అమెరికా హెచ్-1 బీ వీసా భయాలు వెంటాడటంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు(0.36%)నష్టపోయి 8244 వద్ద ముగియగా; సెన్సెక్స్ 119 పాయింట్లు(0.44%) తగ్గి 26,759 వద్ద స్
హెచ్-1బీ వీసా భయాలతో మార్కెట్ల దిగాలు
సానుకూల ఆసియా పరిణామాలను వెనక్కునెట్టి, అమెరికా హెచ్-1 బీ వీసా భయాలు వెంటాడటంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు(0.36%)నష్టపోయి 8244 వద్ద ముగియగా; సెన్సెక్స్ 119 పాయింట్లు(0.44%) తగ్గి 26,759 వద్ద స్థిరపడింది. అయితే మొత్తం వారంలో చూస్తే సెన్సెక్స్ 0.50% బలపడగా; నిఫ్టీ 0.71% పుంజుకొంది.

ఉదయం ప్రారంభ ట్రేడింగ్ సమయంలో దేశీ ఫండ్స్ నిరవధిక కొనుగోళ్లు, ట్రేడర్ల షార్ట్ కవరింగ్ వంటి అంశాల నేపథ్యంలో మరోసారి స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అయితే ట్రంప్ ఆందోళనలు, యూరప్ మార్కెట్ల నష్టాలు సెంటిమెంటును బలహీనపరచాయి. అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు దెబ్బకొడుతున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలు ఐటీ రంగంపై భారీ ప్రభావం చూపించాయి. ఒక బహుళ జాతి కంపెనీని గురించి ఉటంకిస్తూ ట్రంప్ అమెరికా బయట ప్లాంట్లు ఏర్పాటు చేసి దేశంలోకి దిగుమతుల ద్వారా వస్తు,సేవల అమ్మకాలు జరిపితే పన్ను చెల్లింపులు భారీగా చేయాల్సి ఉంటుందని గురువారం హెచ్చరించారు. దీంతో ఈ రోజు ట్రేడింగ్‌లో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న జపనీస్ ఆటో మొబైల్ కంపెనీలైన టయోటా, నిస్సాన్, హోండా, మిత్సుబిషీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మన దేశంలో ఐటీ రంగ షేర్లు బాగా నష్టాలకు గురయ్యాయి.

లాభనష్టాల్లో ఉన్న షేర్లు
ఓఎన్‌జీసీ(1.4%), ఏషియన్ పెయింట్స్(1.23%),రెడ్డీస్(1.01%),హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(0.82%), హెచ్‌డీఎఫ్‌సీ (0.46%) లాభపడిన వాటిలో ఉండగా; ఇన్ఫోసిస్(2.5%), టీసీఎస్(2.18%), విప్రో(2.18%), ఐటీసీ(1.56%), పవర్ గ్రిడ్(1.07%) నష్టాలకు గురయిన వాటిలో ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications