రెండు నెల‌ల గ‌రిష్టానికి సెన్సెక్స్: లోహ‌, స్థిరాస్తి రంగాల రాణింపు

దేశీయ‌ ఫండ్స్‌ పెట్టుబడులు, బ్యాంకింగ్‌, ఆటో కౌంటర్లలో ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ వంటి కార‌ణాల‌తో ఈరోజు దేశీయ మార్కెట్లు రాణించాయి. ఉద‌యం నుంచి సూచీలు లాభాలతో పటిష్టంగా కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి

దేశీయ‌ ఫండ్స్‌ పెట్టుబడులు, బ్యాంకింగ్‌, ఆటో కౌంటర్లలో ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ వంటి కార‌ణాల‌తో ఈరోజు దేశీయ మార్కెట్లు రాణించాయి. ఉద‌యం నుంచి సూచీలు లాభాలతో పటిష్టంగా కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎస్ఈ సూచీ సెన్సెక్స్‌ 245 పాయింట్లు(0.92%) ఎగసి 26,878 వ‌ద్ద‌, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 83 పాయింట్లు లాభ‌ప‌డి 8,274 వద్ద స్థిరపడ్దాయి. దీంతో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8,250ను అధిగమించడమేకాకుండా 8,300కు చేరువలో ముగిసింది.

 రెండు నెల‌ల గ‌రిష్టానికి సెన్సెక్స్: లోహ‌, స్థిరాస్తి రంగాల రాణింపు

బీఎస్ఈలో ఐటీ, టెక్నాల‌జీ రంగ షేర్లు త‌ప్ప అన్నీ లాభాల‌తో ముగిశాయి. అత్య‌ధికంగా లోహ రంగం 3%, స్థిరాస్తి రంగం 2.12% లాభాలు గ‌డించాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగం దాదాపు 1 శాతం నష్టపోగా, మిగిలిన అన్ని రంగాలూ లాభాలతో ముగిశాయి. లోహ 3.2 శాతం లాభ‌ప‌డ‌గా, ఆటో, బ్యాంకింగ్‌, ఫార్మా, రియల్టీ 1-2 శాతం మధ్య ఎగిశాయి. బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌బ్యాంక్‌, టాటా స్టీల్‌, భారతీ, బాష్‌, బీపీసీఎల్‌, జీ, మారుతీ 2.7-4 శాతం మధ్య పురోగమించాయి. అయితే టెక్‌ మహీంద్రా 2.6 శాతం పతనమైంది. ఈ బాటలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 0.6-2 శాతం మధ్య నష్టపోయాయి.

లాభ‌ప‌డిన‌వి, న‌ష్టాల్లో ఉన్న‌వి

మార్కెట్ల బాటలో చిన్న షేర్లు కూడా భారీ లాభాలతో ఉత్సాహంగా క‌దిలాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్‌ ఇండెక్స్‌ 1.3 శాతం జంప్‌చేయగా, స్మాల్ క్యాప్‌ 1 శాతం బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1933 లాభపడగా, కేవలం 855 నష్టపోయాయి. మిడ్‌ క్యాప్స్‌లో జేఎస్‌డబ్ల్యూ, జిందాల్‌ స్టీల్‌, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌, టీవీఎస్ మోటార్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అదానీ పవర్‌, పిరమల్‌, ఎంఆర్‌ఎఫ్‌, సెయిల్‌, అమరరాజా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్, హావెల్స్‌ తదితరాలు 2 నుంచి 8 శాతం మధ్య ఎగశాయి. ఇక స్మాల్‌ క్యాప్స్‌లో సుప్రీం ఇన్‌ఫ్రా, జస్ట్‌డయల్‌, ఫెడర్స్‌ లాయిడ్, ఫోర్స్‌ మోటార్స్‌, వివిమెడ్‌, ఫ్యూచర్‌ లైఫ్‌, సుందరం ఫాజనర్స్‌, జీఎన్‌ఎఫ్‌సీ, వినతీ ఆర్గానిక్స్‌, జీఎండీసీ, ఇండొరమా, ఎంఈపీ, న్యూక్లియస్‌, తదితరాలు 16-6 శాతం మధ్య జంప్‌చేశాయి.
సెన్సెక్స్ గెయిన‌ర్ల‌లో అదానీ పోర్ట్స్‌(4.88%), టాటా స్టీల్‌(3.47%), ఓఎన్‌జీసీ(2.73%),టాటా మోటార్స్‌(2.73%), ప‌వ‌ర్ గ్రిడ్‌(2.5%) ఉండ‌గా; టీసీఎస్‌(1.85%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(0.22%), ఇన్పోసిస్‌(0.19%), ఎన్టీపీసీ(0.03%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+