For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ చెల్లింపుల బ్యాంకు కార్య‌క‌లాపాలు వ‌చ్చే నెల నుంచే

రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును అందుకున్నట్లు పేటిఎమ్ మంగళవారం తెలిపింది. వచ్చే నెల నుంచి పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు మొదలు కావచ్చని వివరించింది. దీంతో వ్యక్తిగతంగా, చిన్నతరహా వ

|

రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును అందుకున్నట్లు పేటిఎమ్ మంగళవారం తెలిపింది. వచ్చే నెల నుంచి పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు మొదలు కావచ్చని వివరించింది. దీంతో వ్యక్తిగతంగా, చిన్నతరహా వ్యాపారుల నుంచి ఒక్కో ఖాతాకు లక్ష రూపాయల వరకు పేటీఎమ్ బ్యాంకు డిపాజిట్లను సేకరించవచ్చు.

పేటీఎమ్ ఖాతా తెరిచే విధానం, ఉప‌యోగించే ప‌ద్ద‌తులుపేటీఎమ్ ఖాతా తెరిచే విధానం, ఉప‌యోగించే ప‌ద్ద‌తులు

'ఈరోజే ఆర్‌బిఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన అనుమతి వచ్చింది. ఇక ఏమాత్రం తాము ఆలస్యం చేయబోం. వీలైనంత త్వరగా పేమెంట్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తాం.' అని వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మంగళవారం వెల్ల‌డించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పేటీఎమ్ త‌న తొలి బ్రాంచ్‌నుఏర్పాటుచేయవచ్చని సంస్థ ప్రతినిధి తెలిపారు. మొత్తం 11 సంస్థలకు ఆర్‌బిఐ.. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులను ఇవ్వగా, అందులో టెక్ మహీంద్ర, చోళమండలమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, దిలీప్ సంఘ్వీ నేతృత్వంలోని మరో సంస్థ లైసెన్సులను వెనక్కిచ్చేశాయి. 11 అనుమ‌తి పొందిన పేమెంట్స్ బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ మాత్రమే ఇప్పటివరకు ఇందులో సేవలను మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్‌లోగా ఆదిత్యా బిర్లా నేతృత్వంలోని ఐడియా సంస్థ పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించే వీలుండగా, ఇప్పుడు పేటీఎమ్ ఆ సేవలను వీలైనంత తొంద‌ర‌గా ప్రారంభించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Read more about: paytm wallet
English summary

పేటీఎమ్ చెల్లింపుల బ్యాంకు కార్య‌క‌లాపాలు వ‌చ్చే నెల నుంచే | Paytm Payments Bank receives final approval from RBI

Paytm Payments Bank Ltd, an entity majority owned by One97 Communication founder Vijay Shekhar Sharma has received the final approval from the Reserve Bank of India, the company confirmed on Tuesday.
Story first published: Wednesday, January 4, 2017, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X