40 శాతం కొత్త నోట్లు పల్లె ప్రాంతాలకే: రిజర్వ్ బ్యాంక్
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నగదు కొరత ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. ఈ నగదు కొరత సమస్యను అధిగమించడానికి గ్రామీణ ప్రాంతాల ప
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నగదు కొరత ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. ఈ నగదు కొరత సమస్యను అధిగమించడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. ఇక నుంచి వచ్చే కొత్త నోట్లలో 40 శాతం నోట్లను గ్రామీణ, మండల ప్రాంతాలకు పంపాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. నోట్ల రద్దును ప్రకటించి 50 రోజులు దాటినా ఇంకా కొన్ని చోట్ల నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారానికి రూ. 24 వేలు పరిమితి మేరకైనా తమ నగదు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు ఖాతాదార్లకు అవకాశం ఉండటం లేదు. మరోవైపు ఆశించిన స్థాయిలో కొత్త నోట్లు గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదనే వాస్తవాన్ని ఆర్‌బీఐ గుర్తించింది. కొన్ని చర్యలు తీసుకున్నా అవేవీ పూర్తి స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. అందుకే ఆర్‌బీఐ తాజా నిర్ణయాన్ని తీసుకుని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి పీఎఫ్ ఖాతా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

గ్రామాలకు 40 శాతం నోట్లను పంపడం ద్వారా నగదు కొరత సమస్యకు ఉపశమనం లభిస్తుందని ఆర్‌బీఐ వివరిస్తోంది. తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకు చెస్ట్‌లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. రూ.100 నోటు కన్నా తక్కువ విలువ ఉన్న నోట్లను కూడా గ్రామీణ ప్రాంతాలకు పంపాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లుగా అవసరమైన నోట్లు అందడం లేదని, దీని పరిష్కారం కోసం ఇది వరకే దీని కోసం కొన్ని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ ప్రస్తావించింది.


Click it and Unblock the Notifications