ఎన్ఆర్‌ఐలు నోట్లు మార్చుకునేందుకు కస్టమ్స్ ధ్రువీకరణ పత్రం పొందాల్సిందే: ప‌్రభుత్వం
దేశంలో డిపాజిట్ చేసే ఎన్ఆర్‌ఐలు, విదేశాల్లో ఉంటున్న భారతీయుల విషయంలో కేంద్రం కొత్త మెలిక పెట్టింది. డిపాజిట్ చేసే కంటే ముందు.. ఆయా వ్యక్తులు కస్టమ్స్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది, ఆ పత్రా
ఎన్నారైలకు ఫెమా కింద రూ. 25 వేల డిపాజిట్ పరిమితి
పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు గడువు పూర్తయింది. ఇకపై ఎవరైనా తమ వద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయాలంటే ఆర్బీఐ శాఖలకు వెళ్లాల్సిందే. ఇలాంటి సమయంలో దేశంలో డిపాజిట్ చేసే ఎన్ఆర్‌ఐలు, విదేశాల్లో ఉంటున్న భారతీయుల విషయంలో కేంద్రం కొత్త మెలిక పెట్టింది. డిపాజిట్ చేసే కంటే ముందు.. ఆయా వ్యక్తులు కస్టమ్స్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొంది, ఆ పత్రాల్లో ఎంత డబ్బైతే నమోదు చేశారో.. అంత మొత్తం మాత్రమే ఆర్బీఐ శాఖల్లో జమ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రవాస భారతీయులు మార్చి 31 తర్వాత ముంబయి, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కత, నాగ్‌పూర్ ఆర్బీఐ కార్యాలయాలను డిపాజిట్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

విదేశాలకు వెళ్లే భారతీయులకైతే మార్చి 31 వరకు, ఎన్ఆర్‌ఐలకు జూన్ 30 వరకు ఆర్బీఐ శాఖల్లో డబ్బు డిపాజిట్ చేసేందుకు అవకాశాన్నిచ్చారు. అయితే.. విదేశాల నుంచి వచ్చి తమ పాత నగదును డిపాజిట్ చేసేందుకు దేశానికి వచ్చేవారు.. ఆయా విమానాశ్రయాల్లో తాము డిపాజిట్ చేసే పాత డబ్బును చూపించాల్సి ఉంటుంది. అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బు మార్చుకోవాలన్న దానిపై పరిమితి లేదని, ఎన్నారైలకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద ఒక్కొక్కరి రూ. 25వేలు పరిమితి ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications