155 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, దూసుకెళ్లిన టాటా మోటార్స్, మారుతి సుజుకి
ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేశీయయ మార్కెట్లు లాభపడ్డాయి. డిసెంబర్ డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలోనూ మార్కెట్లు ఆశావహంగా కదిలాయి. రోజు మొత్తం లాభాల మధ్యే కదిలి చివరికి చెప్పుకోదగ్గ
ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేశీయయ మార్కెట్లు లాభపడ్డాయి. డిసెంబర్ డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలోనూ మార్కెట్లు ఆశావహంగా కదిలాయి. రోజు మొత్తం లాభాల మధ్యే కదిలి చివరికి చెప్పుకోదగ్గ స్థాయిలో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155 పాయింట్లు పెరిగి 26,366 వద్ద నిలవగా, నిఫ్టీ 69 పాయింట్లు జంప్‌చేసి 8,104 వద్ద స్థిరపడింది. తద్వారా ఎన్ఎస్ఈ 50 మరోసారి సాంకేతికంగా కీలకమైన 8,100కు ఎగువన ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్‌లో రంగాల వారీగా చూస్తే వినియోగదారు వస్తు రంగం 1.67%, చమురు, సహజ వాయు రంగం 1.57%, లోహ రంగం 1.44%, వాహన రంగం 1.34% లాభపడగా; మూలధన వస్తు రంగం 0.09% నష్టపోయింది. సెన్సెక్స్ టాప్ గెయినర్లలో టాటా మోటార్స్(1.64%), హెచ్‌డీఎఫ్‌సీ(1.55%), టీసీఎస్(1.51%), రిలయన్స్(1.21%) ముందుండగా; అదానీ పోర్ట్స్(1.29%), సన్ ఫార్మా(1.25%), ఇన్ఫోసిస్(1.21%), ఎల్ అండ్ టీ(0.69%), పవర్ గ్రిడ్(0.39%) ఎక్కువ నష్టపోయాయి.
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా ఒక్కటే అదికూడా 0.2 శాతం నష్టపోగా, మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్స్, ఆటో, రియల్టీ, ఐటీ 1 నుంచి 1.5% మధ్య పుంజుకున్నాయి.
బ్లూచిప్స్‌లో గ్రాసిమ్, బీపీసీఎల్, యస్‌బ్యాంక్, ఐషర్, బాష్, టాటా మోటార్స్ డీవీఆర్, అల్ట్రాటెక్, మారుతీ, టాటా పవర్, హెచ్‌సీఎల్ టెక్ 2 నుంచి 4 శాతం మధ్య పైకి దూసుకుపోగాగా అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, అరబిందో, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ తదితరాలు 1.6-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి.


Click it and Unblock the Notifications