స్వ‌ల్ప న‌ష్టంలో సెన్సెక్స్‌, లాభంలో నిఫ్టీ

పన్ను రేట్లు తగ్గించాల్సిన అవసరముందన్న జైట్లీ వ్యాఖ్యలకు మంగళవారం దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు ఈ రోజూ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సానుకూల ప్రపంచ మార్కెట్లు, దేశీ ఫండ్స్‌ భారీ కొనుగోళ్ల నేపథ్యంలో సానుకూ

పన్ను రేట్లు తగ్గించాల్సిన అవసరముందన్న జైట్లీ వ్యాఖ్యలకు మంగళవారం దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు ఈ రోజూ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సానుకూల ప్రపంచ మార్కెట్లు, దేశీ ఫండ్స్‌ భారీ కొనుగోళ్ల నేపథ్యంలో సానుకూలంగా ప్రారంభ‌మైన ట్రేడింగ్ చివరికి నిరాశగా ముగిసింది. సెన్సెక్స్‌ 3 పాయింట్లు తగ్గి 26,211 వద్ద ముగియ‌గా, నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 8,035 వద్ద స్థిరపడింది. అయితే మిడ్‌ సెషన్‌కల్లా నిఫ్టీ 65 పాయింట్లు ఎగసి సాంకేతికంగా కీలకమైన 8,100ను అందుకుంది. ఆపై ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగ‌డంతో త‌గ్గుతూ వ‌చ్చింది. చివరికి నామమాత్ర లాభంతో సరిపెట్టుకుంది. ఈ బాటలో సెన్సెక్స్‌ కూడా ఒక దశలో 200 పాయింట్ల వరకూ పైకి ఎగ‌సిన‌ప్ప‌టికీ చివర్లో ఊపందుకున్న అమ్మకాలతో స్వల్ప నష్టంతో క్లోజ‌యింది.

స్వ‌ల్ప న‌ష్టంలో సెన్సెక్స్‌, లాభంలో నిఫ్టీ

కోల్‌ ఇండియా, భారతీ ఇన్ఫ్రాటెల్‌, ఐడియా సెల్యూలర్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లు లాభాల్లో ట్రేడ్ కొన‌సాగ‌గా.. టాటా మోటార్స్‌(డి), రిలయన్స్‌, యస్‌బ్యాంక్‌, హిందాల్కో, హీరోమోటోకార్ప్‌ నష్టపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+