దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు, కీలక స్థాయిలను దాటేసిన రెండు సూచీలు
దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. బ్లూచిప్ షేర్లైన ఐటీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ వంటి షేర్ల కొనుగోళ్ల కోసం మదుపర్లు ఎగబడటంతో సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 406 ప
దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. బ్లూచిప్ షేర్లైన ఐటీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ వంటి షేర్ల కొనుగోళ్ల కోసం మదుపర్లు ఎగబడటంతో సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 406 పాయింట్ల(1.57%) లాభంతో 26213 పాయింట్ల స్థాయిని చేరగా, నిఫ్టీ 124.6 పాయింట్లు(1.58%) పైకి ఎగసి 8032 వద్ద స్థిరపడింది. సోమవారం కీలక 8000 దిగువకు చేరిన నిఫ్టీ ఈ రోజు 8వేల స్థాయిని దాటడం మదుపర్ల సెంటిమెంటును బలపరిచింది.
దేశంలో లిస్టెడ్ కంపెనీల వివరాలు

రంగాల వారీగా చూస్తే అన్ని రంగాలు కళకళలాడాయి. ఎఫ్ఎమ్‌సీజీ, లోహ రంగం, ఆటో, వినియోగదారు వస్తువుల రంగాలు 2 నుంచి 4 శాతం మధ్య లాభపడ్డాయి. మార్కెట్లతోపాటు చిన్న షేర్లు కూడా బుల్ జోరును అందుకున్నాయి. ఒక్కసారిగా ఊపందుకున్న కొనుగోళ్లతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.5 శాతం జంప్‌చేశాయి. రేపటితో డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు స్క్వేరప్ లావాదేవీలకు ప్రాధాన్యమిచ్చారని, దీంతో మార్కెట్లకు ప్రోత్సాహం లభించిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

బీఎస్ఈలో లాభపడిన, నష్టపడిన షేర్ల వివరాలు చూస్తే ఐటీసీ(4.02%), టాటా స్టీల్(3.23%), అదానీ పోర్ట్స్(2.87%), ఐసీఐసీఐ బ్యాంకు(2.25%), లుపిన్(2.13%) లాభపడగా; కేవలం గెయిల్(0.95%) మాత్రం నష్టపోయింది.
దేశంలో లిస్టెడ్ కంపెనీల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications