For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెక్కు బౌన్స్ అయితే కేసు పూర్తికి మునుపే జైలుకే...

చెల్లని చెక్కులు ఇస్తున్న వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతోంది. ఇలాంటి వ్య‌హ‌హార‌ల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఏళ్ల త‌ర‌బ‌డి కోర్టుల్లో చెక్కు బౌన్సు సంబంధిత కేసులు సాగుత

|

చెల్లని చెక్కులు ఇస్తున్న వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతోంది. ఇలాంటి వ్య‌హ‌హార‌ల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఏళ్ల త‌ర‌బ‌డి కోర్టుల్లో చెక్కు బౌన్సు సంబంధిత కేసులు సాగుతుండ‌టంతో వాటిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఇందుకోసం నిబంధ‌న‌ల‌ను ప‌టిష్ట‌ప‌రుస్తోంది. ఆ దిశ‌గా నెగోషియ‌బుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌-1881ని సవ‌రించి నిబంధ‌న‌ల‌ను మ‌ర్చాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌వ‌ర‌ణ‌ల త‌ర్వాత చెల్లని చెక్కులు ఇచ్చిన కేసుల్లో బెయిల్ ల‌భించే వీల్లేకుండా ఏర్పాట్లు ఉంటాయ‌ని తెలుస్తోంది.


ప్ర‌స్తుతం చెల్ల‌ని చెక్కు కేసు కింద క్రిమిన‌ల్ కేసు న‌మోద‌యినప్ప‌టికీ బెయిల్ పొందేందుకు అవ‌కాశం ఉంది. దీంతో విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత జైలు శిక్ష ప‌డేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌నే ఉద్దేశంతో చాలా మంది దీన్ని లెక్క చేయ‌డం లేదు. నేరం చేసిన‌ట్లు రుజువ‌యితే చ‌ట్టంలోని సెక్ష‌న్ 138 కింద రెండింత‌ల జ‌రిమానా లేదా గ‌రిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, లేదా రెండూ గానీ అనుభ‌వించాల్సి ఉంది.

దేశంలో ఉన్న వివిధ చెక్కుల ర‌కాలు
స‌వ‌ర‌ణ‌ల‌కు చేసిన ప్ర‌తిపాద‌న‌లు
* ఇచ్చిన చెక్కు బౌన్స‌యితే ఇరు ప‌క్షాల‌కూ నెల రోజుల గ‌డువిస్తారు. ఆ స‌మ‌యంలో వారు ఉభ‌య‌తార‌కంగా స‌మ‌స్య‌ను ప‌రిష్కరించుకోవాలి.
* ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోలేక‌పోతే కోర్టు ఆదేశాల మేర‌కు చెల్లని చెక్కు జారీ చేసిన వారికి జైలు శిక్ష విధించ‌వ‌చ్చు.
* కొత్త స‌వ‌ర‌ణ ప్ర‌తిపాద‌న ప్ర‌కారం న్యాయస్థానంలో కేసు పూర్తి ప‌రిష్కారం కాక‌ముందే స‌ద‌రు చెక్కు జారీ చేసిన వారిని అరెస్టు చేయ‌వ‌చ్చు.

Read more about: cheque banking
English summary

చెక్కు బౌన్స్ అయితే కేసు పూర్తికి మునుపే జైలుకే... | A dishonoured cheque can land you jail before case is settled

With cheque transactions on the rise post demonetisation, the government has now proposed to introduce stringent action against those whose cheques are dishonoured. If a cheque bounces then the defaulter would be given a month's time failing which he will land in jail even before the case is settled.
Story first published: Tuesday, December 27, 2016, 11:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X