గత ఏడు సెషన్లలోని పతనానికి బ్రేక్ పడి వారాంతంలో హమ్మయ్య అనిపించిన స్టాక్ మార్కెట్లు, సోమవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు కనిష్టాల
గత ఏడు సెషన్లలోని పతనానికి బ్రేక్ పడి వారాంతంలో హమ్మయ్య అనిపించిన స్టాక్ మార్కెట్లు, సోమవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. రోజు మొత్తం నష్టాల మధ్యే కదిలిన దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు కనిష్టాల వద్దే స్థిరపడ్డాయి. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు, ఎఫ్ఐఐలు నిధులు వెనక్కి తీసుకోవడం, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మార్కెట్లను బాగా దెబ్బతీయగా మూలధన లాభాలపై పన్ను విధించబోతామన్న సంకేతాలను ప్రభుత్వం ఇవ్వడం పెట్టుబడిదార్లను భయాందళోనలకు గురిచేస్తోంది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ఈ దశలోనూ కోలుకోలేదు. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 234 పాయింట్లు క్షీణించి 25,807 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయి 7,908 వద్ద స్థిరపడింది. ఇది 7 నెలల కనిష్టంకాగా, తద్వారా ఈ నెలలో జరిగిన 18 ట్రేడింగ్ సెషన్లకుగాను 12 రోజులు నష్టాలతోనే ముగిశాయి. ఇంతక్రితం 2015 మార్చిలో మాత్రమే మార్కెట్లు ఇలాంటి పతనాన్ని చవిచూడటం గమనించదగ్గ విషయం! కాగా, నేటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 7,900 స్థాయిని సైతం కోల్పోయింది. అమ్మకాలు ఊపందుకోవడంతో 90 పాయింట్లుపైగా జారి 7,894 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో సెన్సెక్స్ సైతం ఒక దశలో300 పాయింట్ల వరకూ పడిపోయి 25,754 దిగువకు చేరింది.

రంగాల వారీగా...
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మాత్రమే నష్టపోకుండా నిలదొక్కుకోగా, మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1 నుంచి 3 శాతం మధ్య నష్టాలకు గురయ్యాయి. స్థిరాస్తి ఇండెక్స్ అయితే దాదాపు 4 శాతం కుప్పకూలింది. ఇక నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌యూఎల్ దాదాపు 2 శాతం జంప్‌చేయగా, ఎల్‌అండ్‌టీ 0.5 శాతం, టీసీఎస్ 0.4 శాతం, ఐటీసీ 0.3 శాతం, ఇండస్‌ఇండ్, భారతీ 0.15 శాతం చొప్పున పైకి ఎగిశాయి. మిగిలిన బ్లూచిప్స్ అన్ని నష్టపోగా, హిందాల్కో, సిప్లా 5 శాతం చొప్పున పడిపోయాయి. ఈ బాటలో అరబిందో, బీవోబీ, లుపిన్, ఐషర్, టాటా స్టీల్, ఇన్ఫ్రాటెల్, జీ, స్టేట్‌బ్యాంక్ 2 నుంచి 4.6శాతం మధ్య కోల్పోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో నౌకరి(7.44%), ఫిన్‌కేబుల్స్(3.21%), బాల్‌క్రిష్ణ ఇండస్ట్రీస్(2.99%), జీడీఎల్(2.88%), అలోక్‌టెక్స్ట్(2.87%) లాభపడగా; దివీస్ ల్యాబ్స్(11.64%), భారత్‌ఫిన్(7.59%), వెల్‌కార్ప్(7.59%), డీఎల్ఎఫ్(7.18%), ఇంజినీర్‌సిన్-ENGINERSIN(6.57%) నష్టపోయాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications