పసిడి ధర సోమవారం మరింత తగ్గింది. ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.250 క్షీణించి ఏకంగా 11 నెలల కనిష్ఠానికి చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.27,550 పలికింది. ఆభరణాల తయారీ దారులు, వ్యాపారుల నుంచి
పసిడి ధర సోమవారం మరింత తగ్గింది. ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.250 క్షీణించి ఏకంగా 11 నెలల కనిష్ఠానికి చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.27,550 పలికింది. ఆభరణాల తయారీ దారులు, వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, ఫ్యూచర్ ట్రేడింగ్‌లో తక్కువ ధర పలకడం పసిడి ధర పతనానికి కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.210 తగ్గి రూ.38,600 వద్ద ఉంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో వెండి ధర తగ్గిందని విశ్లేషకులు వెల్లడించారు. అంతేకాకుండా నగదు కొరత సైతం బంగారం, వెండి ధరల పతనానికి కారణమైందని పేర్కొన్నారు.