A Oneindia Venture

స్నాప్‌డీల్ ద్వారా రూ.1 తో ఇంటికి రూ.2000

ఇప్పటి వరకు వ‌స్తువుల‌నే అమ్ముతున్న స్నాప్‌డీల్ న‌గ‌దు కొర‌త నేప‌థ్యంలో ఒక స‌రికొత్త స‌దుపాయాన్నిప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే వినియోగదారుల చెంతకే న‌గ‌దు రానుంది. ఏంటీ... ఇది ఎలా సాధ్యమ‌న

ఇప్పటి వరకు వ‌స్తువుల‌నే అమ్ముతున్న స్నాప్‌డీల్ న‌గ‌దు కొర‌త నేప‌థ్యంలో ఒక స‌రికొత్త స‌దుపాయాన్నిప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే వినియోగదారుల చెంతకే న‌గ‌దు రానుంది. ఏంటీ... ఇది ఎలా సాధ్యమ‌ని నమ్మ‌లేక‌పోతున్నారా? అయితే ఈ క‌థ‌నాన్నిచ‌దివి అర్థం చేసుకోండి..!

స్నాప్‌డీల్ ద్వారా రూ.1 తో ఇంటికి రూ.2000

ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ స్నాప్‌డీల్ ఉంది కదా... దాని ద్వారా ఇక‌పై క‌స్ట‌మ‌ర్లు తమ ఇంటి వద్దకే నగదును క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో పొందవచ్చు. ఈ సేవ‌ను క్యాష్‌@హోం పేరుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వినియోగ‌దారు ముందుగా స్నాప్‌డీల్ సైట్‌లోకి వెళ్లి రూ.1 కనీస చార్జి చెల్లించి నగదు కావాలని రిక్వెస్ట్ పెడితే చాలు, ఇంటికి కొరియర్ సర్వీస్ వచ్చి వస్తువులు అందించినట్టుగానే నగదును పీఓఎస్ మెషిన్ల ద్వారా అందిస్తారు. ఆ సమయంలో వినియోగదారుడు తన వద్ద ఉన్న ఏ బ్యాంకు ఏటీఎమ్ కార్డునైనా ఆ మెషీన్‌లో స్వైప్ చేస్తే చాలు, కొరియర్ సర్వీస్ వారు రూ.2వేల నోటును వినియోగదారులకు అందిస్తారు.

స్నాప్‌డీల్ ద్వారా రూ.1 తో ఇంటికి రూ.2000

నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్ర‌జ‌లు చాలా స‌మ‌యం వ్య‌థ‌లు ప‌డుతున్నారనే ఆలోచనతో స్నాప్‌డీల్ ఈ వినూత్న కార్యక్రమాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. దీని వల్ల వినియోగదారులు తమకు కావల్సిన నగదును ఇంటి వద్దే పొందవచ్చు. అలా నగదు క్యాష్ ఆన్ డెలివరీ అవుతుందన్నమాట. అయితే క్యాష్@హోం అని పిలవబడుతున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి గుర్గావ్, బెంగుళూరులలో ప్రారంభం కానుంది. అనంతరం ఇతర మెట్రో సిటీలు, పట్టణాలకు విస్తరించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+