వరుస నష్టాల నుంచి కోలుకున్న దేశీయ మార్కెట్లు
వారాంతం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా ఏడు సెషన్లు నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు.. ఎట్టకేలకు లాభాలను రాబట్టుకున్నాయి. ఉదయం స్పల్ప నష్టాలతో మొదలైన సూచీలు.. ఆ
వారాంతం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా ఏడు సెషన్లు నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు.. ఎట్టకేలకు లాభాలను రాబట్టుకున్నాయి. ఉదయం స్పల్ప నష్టాలతో మొదలైన సూచీలు.. ఆ తర్వాత పుంజుకున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా చివరకు సానుకూలంగా ముగిశాయి.

ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్, 61.10 పాయింట్ల లాభం(0.24%)తో 26,040.70 దగ్గర ముగియగా, నిఫ్టీ 6.65(0.08%)పాయింట్లు ఎగబాకి 7,985.75 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిని అధిగమించడం ఇవాల్టి ట్రేడింగ్‌లో ముఖ్యమైన విషయం. మూలధన వస్తు రంగంలోని షేర్లు ఎక్కువగా లాభపడగా.. ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు కూడా సానుకూలంగానే ముగిశాయి. బీఎస్ఈలోని మిగిలిన రంగాల్లో స్థిరాస్తి రంగం ఎక్కువగా నష్టాలను మూటగట్టుకుంది. స్థిరాస్తి(1.06%), హెల్త్‌కేర్(0.66%), ఎఫ్ఎమ్‌సీజీ(051%), ఐటీ(0.46%) నష్టపోయాయి. ఉదయం నుంచి లాభాల్లోనే ఉన్న హెల్త్‌కేర్ సెక్టార్.. దివీస్ ల్యాబ్స్ భారీ నష్టాల కారణంగా అత్యధిక నష్టాలను నమోదు చేసింది. ఐటీ, టెక్నాలజీ షేర్లతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు కూడా నష్టాలతోనే ముగిశాయి.
సెన్సెక్స్ టాప్ గెయినర్లలో ఎమ్ఎమ్‌టీసీ(6.30%), బజాజ్ ఫైనాన్స్(5.55%), సిప్లా(4.03%), ఇండియన్‌బీ(3.99%), హిందుస్తాన్‌కాపర్(3.90%) ఉండగా; నష్టపోయిన వాటిలో దివీస్ ల్యాబ్స్(21.87%), భారత్‌ఫిన్(6.27%), క్యాడిలాహెల్త్‌కేర్(5.10%), డెల్టాకార్ప్(3.90%), పీఎఫ్‌సీ(3.84%) ముందున్నాయి.


Click it and Unblock the Notifications