నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: 8వేల దిగువన నిఫ్టీ
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎమ్సీజీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో గురువారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు వరుసగా ఏడో సెష
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎమ్సీజీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో గురువారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు వరుసగా ఏడో సెషన్లోనూ నష్టాల్లో తాకిడి కొనసాగుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడితో వంద పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, మధ్యాహ్నం సెషన్లో మరింత క్షీణించి 250 పాయింట్ల నష్టంలో కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 26వేల పాయింట్ల కీలక స్థాయిని కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ నిఫ్టీ 8వేల కిందకు జారిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి . సెన్సెక్స్ అత్యధికంగా 262.78 పాయింట్లు నష్టపోయి 25,979.60కు చేరుకోగా, నిఫ్టీ అయితే 82.20 పాయింట్ల నష్టంతో 7,979.10 వద్ద స్థిరపడింది.

ట్రేడింగ్ ముగిసే సరికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్‌ఫ్రా, ఆయిల్ షేర్లు పతనమయ్యాయి. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టాటా మోటార్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ తదితర షేర్లు లాభపడగా, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ మొదలైన షేర్లు నష్టాలు చవి చూశాయి.


Click it and Unblock the Notifications