గోఎయిర్ క్రిస్‌మ‌స్ ఆఫ‌ర్‌: రూ.999కే విమాన ప్ర‌యాణం

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశీయ విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా గోఎయిర్ సంస్థ పరిమిత కాలవ్యవధితో 999 రూపాయలకే టిక్కెట్ల‌ను జారీ చేస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఓ ప్రకట

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశీయ విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా గోఎయిర్ సంస్థ పరిమిత కాలవ్యవధితో 999 రూపాయలకే టిక్కెట్ల‌ను జారీ చేస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఓ ప్రకటన ద్వారా బుధవారం సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 'క్రిస్మస్ క్యాంపెయిన్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో గోఎయిర్ విమానాలు నడుస్తున్న మార్గాల్లో వచ్చే నెల జనవరి 9 నుంచి ఏప్రిల్ 15.2017 వరకూ 999 రూపాయల ధరకే ప్రయాణించే అవకాశం ఉంది. ఇందుకోసం డిసెంబ‌రు 31లోగా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గోఎయిర్ వెబ్‌సైట్, గోఎయిర్ టిక్కెట్ కౌంటర్లు, గోఎయిర్ కాల్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్ల వద్ద ఈ టిక్కెట్లు లభిస్తాయి. పరిమిత సీట్లను కలిగిన ఈ ఆఫర్‌లో ముందుగా బుక్ చేసుకున్న‌(ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ్‌) వారికే ప్రాధాన్యం ఇస్తామని గోఎయిర్ స్పష్టం చేసింది. ఆయా మార్గాల ఆధారంగా ధరలు ఉంటాయన్న సంస్థ.. ప్రయాణికులు ఈ ఆఫర్‌కు అనుగుణంగా తమ హాలిడే టూర్లను ప్లాన్ చేసుకోవచ్చ‌ని వెల్ల‌డించింది.

GoAir Christmas Sale Tickets On Offer From Rs.999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+