భారతీయ ప్రాంతీయ భాషల్లోనూ ఈ-మెయిల్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, జైపూర్‌కు చెందిన డేటామెయిల్‌తో స్థానిక భాషల్లో ఈ-మెయిల్ క్రియేషన్ కోసం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ సౌకర్యాన్ని అ
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, జైపూర్‌కు చెందిన డేటామెయిల్‌తో స్థానిక భాషల్లో ఈ-మెయిల్ క్రియేషన్ కోసం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 'దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలన్నది ప్రధాని మోదీ ఆశయం. ఇందులో భాగంగా ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు రూపొందించుకోవచ్చు. ఇక నుంచి వారు తమ మాతృభాష, ప్రాధాన్యం ఉన్న భాషలో ఈ-మెయిల్ అడ్రస్‌ను సృష్టించుకోవచ్చు' అని బీఎస్‌ఎన్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో తెలిపారు.మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ రూపొందించుకునే సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ మేరకు డేటామెయిల్‌తో ఒప్పందం జరిగింది.

భారతీయ భాషల్లో ఈ-మెయిల్ సేవలను ప్రారంభించినట్లు డాటా ఎక్స్‌జెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సీఈవో అజయ్ డాటా వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని భాషల్లో విస్తరించే యోచన చేస్తున్నట్లు చెప్పారు.అంతర్జాతీయ భాషల విషయానికొస్తే.. ఇంగ్లీష్‌తోపాటు అరబిక్, రష్యన్, చైనీస్‌లోనూ ఈ-మెయిల్ ఐడీని ఏర్పాటు చేసుకునే సర్వీసులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ రకమైన ఈ-మెయిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్టోర్లలో డేటా మెయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ సృష్టించుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ (వినియోగదారుల సేవలు)ఎన్‌కే గుప్తా తెలిపారు.


Click it and Unblock the Notifications