ఇండియన్ జీడీపీ రూపాయల్లో 153 ట్రిలియన్లు, దీన్ని డాలర్లలోకి మారిస్తే 2.30 ట్రిలియన్లు విలువ ఉంటుంది. ఇండియా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎగబాకిందన
యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్థిక వ్యవస్థను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే జీడీపీ పరంగా 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించింది. సుమారు 150 ఏళ్ల చరిత్రలో యూకే ఆర్థిక వ్యవస్థను మన దేశం అధిగమించడం ఇదే తొలిసారి. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో వేగవంతమైన ఆర్థికవృద్ధి చోటు చేసుకోగా, 12 మాసాల్లోనే బ్రిటన్ పౌండ్ విలువ అమాంతం పడిపోయిందంటూ ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. బ్రిటన్ పౌండ్ విలువ గత 12 మాసాలుగా 20 శాతం విలువ కోల్పోవడంతో 2020 నాటికి యూకే జీడీపీని భారత్ అధిగమిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

అయితే 2016 యూకే జీడీపీ విలువ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ప్రకారం 1.87 ట్రలియన్లు... ఇది అమెరికన్ డాలర్లలోకి మారిస్తే దాని విలువ 2.29 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని, పౌండ్ విలువలో డాలర్‌తో పోల్చుకుంటే 0.81 శాతం...అలాగే ఇండియన్ జీడీపీ రూపాయల్లో 153 ట్రిలియన్లు, దీన్ని డాలర్లలోకి మారిస్తే 2.30 ట్రిలియన్లు విలువ ఉంటుంది. ఇండియా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎగబాకిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
Read more ప్రపంచంలో పది సంపన్న దేశాలు

డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.6 పైసలని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా భారత్ వృద్ది రేటు 6 నుంచి 8 శాతం మధ్య ఇలానే కొనసాగితే 2020 నాటికి ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యత్యాసం మరింతగా తగ్గుతుందని ఫోర్బ్స్ తెలిపింది.
భారత్ మార్కెట్ సంస్కరణలు చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందని ఫోర్బ్స్ విశ్లేషించింది. అయినప్పటికీ పర్ క్యాపిటా జీడీపీ విషయంలో యూకేలో ఐదింట ఒక వంతు మాత్రమే భారత్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఈ విధంగా యూకేను జీడీపీ విషయంలో ఒక ముఖ్య విషయాన్ని బయటపెడుతోంది. వలస దేశం వాసనల నుంచి ఇండియా బయటపడుతోంది. అంతే కాకుండా 1905లో రష్యా దేశాన్ని జపాన్ ఆర్థిక వ్యవస్థ దాటేసిన విషయాన్ని ఇప్పుడు ఆర్థిక నిపుణులు గుర్తుకు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications