10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే స్వచ్చందంగా ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించినా మాట వినని వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. మీ ఆదాయం ఏడాదికి
10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే స్వచ్చందంగా ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించినా మాట వినని వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. మీ ఆదాయం ఏడాదికి రూ.10 లక్షలకు పైగా ఉండి కూడా రాయితీ పొందుతున్నారా? అయితే త్వరలోనే మీ గ్యాస్ సబ్సిడీ రద్దవుతుంది. ఎందుకంటే.. ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారి వివరాలను ఆదాయపన్ను శాఖ పెట్రోలియం, చమురు మంత్రిత్వ శాఖకు అందజేయనుంది.సిలిండర్ వినియోగదారు లేదా అతడి/ఆమె జీవిత భాగస్వామి పన్ను చెల్లించాల్సిన ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారికి సబ్సిడీ లభించదని మోదీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐటీశాఖ; పెట్రోలియం,చమురు మంత్రిత్వ శాఖలు సమాచార మార్పిడికి ఒప్పందం చేసుకున్నాయి. అధిక ఆదాయ వర్గాలకు గ్యాస్ రాయితీని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ విధమైన సన్నాహాలు చేస్తోంది. పది లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారి పేర్లను మాత్రమే కాదు.. వారి పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్), పుట్టినతేదీ, స్త్రీయా లేక పురుషుడా అనే విషయం, వారి చిరునామా, ఈమెయిల్ ఐడీ, ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్ నంబర్లు.. అన్నింటినీ అందజేస్తుంది.

ఈ రెండు ప్రభుత్వ శాఖలు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ నుంచి ఆమోదం వచ్చిన నేపథ్యంలో ఈ పని వేగవంతం కానుంది.
ఐటీ విభాగం నుంచి అందిన వివరాల ప్రకారం.. రూ.10 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి వెంటనే గ్యాస్ రాయితీ కట్ అయిపోతుంది. ప్రభుత్వం పిలుపు మేరకు చాలా మంది గ్యాస్ రాయితీని వదులుకున్నప్పటికీ.. ఇంకా చాలా మంది రాయితీని పొందుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికాదాయ వర్గాల వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందని.. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


Click it and Unblock the Notifications