డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన చార్జీలను తగ్గించకపోతే ప్రజలు తిరిగి నగదు లావాదేవీలకే మొగ్గుచూపే అవకాశం ఉందని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఖర్చులకు సంబంధించి సున్నితంగా ఆల
డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన చార్జీలను తగ్గించకపోతే ప్రజలు తిరిగి నగదు లావాదేవీలకే మొగ్గుచూపే అవకాశం ఉందని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఖర్చులకు సంబంధించి సున్నితంగా ఆలోచించే భారత్ లాంటి దేశాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ రుసుములు తక్కువగా ఉండాల్సి ఉందని ఆయన అన్నారని పీటీఐ కథన సారాంశం. ప్రస్తుతం మార్చి 31 వరకూ నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన చార్జీలను రద్దు చేస్తూ ప్రభుత్వం, వివిధ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దాని తర్వాత చార్జీల మినహాయింపులను కొనసాగించాల్సి ఉందని రామ్ సేవక్ శర్మ అన్నారు. ఫిక్కీ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దీర్ఘకాలంలో చూస్తే డిజిటల్ లావాదేవీలపై ప్రభావం చూపేది దానికయ్యే ఖర్చేనని, దానికి సంబంధించి ఖర్చులు తక్కువగా ఉండేలా తాను సూచిస్తున్నానన్నారు. ఉదాహరణగా టెలికాం రంగం గురించి చెప్పుకొచ్చారు. మొబైల్ రీచార్జీలు రూ.10 నుంచి సైతం చేసుకోవచ్చని, అవి కూడా ఆన్‌లైన్‌లో చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇదే తరహా ఫార్ములాను ఆర్థిక రంగం అనుసరించాల్సింది ఉందని సూచించారు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు ఖాతాకు డబ్బు పంపేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా లేదా సున్నాగా ఉండాల్సి ఉందని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. నగదు ఎక్కువగా వ్యవస్థలో చలామణీలో ఉండటం ఇబ్బందికరమని, అలా ఉంటే బ్యాంకులకు ఎక్కువ లాభాలు వస్తాయని ఆయన అన్నారు. బ్యాంకులు ఈ మార్గంలో వచ్చే డబ్బును ఆదాయంగా చూడకూడదని శర్మ సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications