న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

అంత‌ర్జాతీయ ప‌రిణామాలు ప్రతికూలంగా ఉండటంతో బలహీనంగా మొదలైన దేశీయ‌ మార్కెట్లు రోజు మొత్తం న‌ష్టాల్లోనే కదిలాడాయి. చివరికి స్వ‌ల్ప‌ నష్టాలతో ముగిశాయి. అయితే చివరి 30 నిమిషాల్లో ఒక్కసారిగా ఊపందుకున్న అమ్

అంత‌ర్జాతీయ ప‌రిణామాలు ప్రతికూలంగా ఉండటంతో బలహీనంగా మొదలైన దేశీయ‌ మార్కెట్లు రోజు మొత్తం న‌ష్టాల్లోనే కదిలాడాయి. చివరికి స్వ‌ల్ప‌ నష్టాలతో ముగిశాయి. అయితే చివరి 30 నిమిషాల్లో ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాల కారణంగా సెన్సెక్స్‌ 140 పాయింట్లు కోల్పోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఒక ద‌శ‌లో సాంకేతికంగా కీలకమైన 8,100 దిగువకు చేరింది. ముగింపులో కాస్త కోలుకోవడంతో 35 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకొని 8,104 వద్ద నిలిచింది. ఇక సెన్సెక్స్‌ కూడా 115 పాయింట్లు తక్కువగా 26,375 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగం యథాతథంగా నిలవగా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్‌, ఫార్మా, ఆటో 1-0.6 శాతం మధ్య క్షీణించాయి.

115 పాయింట్ల న‌ష్టంతో ముగిసిన సెన్సెక్స్‌

లాభాల్లో, నష్టాల్లో ఉన్న ప్ర‌ముఖ సంస్థ‌లివే...
బ్లూచిప్‌ షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏసీసీ, అదానీ పోర్ట్స్‌, మారుతీ, భారతీ, ఎస్‌బీఐ 3-1.3 శాతం మధ్య న‌ష్ట‌పోగా, గెయిల్‌ అత్యధికంగా 2.3 శాతం లాభ‌ప‌డింది. అదే విధంగా అరబిందో, టాటా పవర్‌, గ్రాసిమ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ 1-0.5 శాతం లాభపడటం ద్వారా కొంతమేర మార్కెట్లను ఆదుకున్నాయి. టాప్ 5గెయిన‌ర్ల‌లో గెయిల్‌, అరబిందో ఫార్మా, గ్రాసిమ్‌, టాటా పవర్‌, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు లాభపడగా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొదలైన షేర్లు టాప్ లూజ‌ర్లుగా నష్టాలతో ముగిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+