డిజిటల్ లావాదేవీల పెంపుకోసం చార్జీల తగ్గింపు
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ కొన్ని ఛార్జీలను తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. ఇమ్మిడీయట్ పేమెంట్ సర్వీస్(ఐఎమ్‌పీఎస్), యూఎస్ఎస్‌డి మొబైల్ యాప్, యూపిఐ ద్వారా రూ. 1000 లోపు చేసే లావా
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ కొన్ని ఛార్జీలను తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. ఇమ్మిడీయట్ పేమెంట్ సర్వీస్(ఐఎమ్‌పీఎస్), యూఎస్ఎస్‌డి మొబైల్ యాప్, యూపిఐ ద్వారా రూ. 1000 లోపు చేసే లావాదేవీలకు ప్రస్తుతం ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదని ఆర్బీఐ నిర్ణయించింది.
వచ్చే జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్ర బ్యాంకు వెల్లడించింది. ఈ లోపు ఈ సేవలకు ఎంత ఛార్జీలను వసూలు చేయాలి అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు సంబంధిత సంస్థలతో చర్చలు జరుపుతామని ఆర్బీఐ తెలిపింది.

వీటికి తోడు డెబిట్ కార్డులపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్స్(ఎండిఆర్)ను కూడా సడలించింది ఆర్బీఐ. ఇకపై రూ.1000 లోపు జరిగే డిజిటల్ చెల్లింపులకు 0.25 శాతం, రూ.1001 నుంచి రూ.2000 లోపు ట్రాన్సాక్షన్స్‌కు 0.5 శాతం మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఇది కూడా జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ అమలవుతుంది.
కార్డ్ పేమెంట్స్, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆర్బీఐ కూడా తన వంతు మద్దతును ప్రకటిస్తోంది. ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవల సంస్థలు, ఆన్ లైన్ సేవలు అందించే కంపెనీలు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లు తయారు చేసే కంపెనీలకు మరింత డిమాండ్ పెరగబోతోంది.
2017 జనవరి నుంచి మార్చి వరకు ఈ చార్జీలు అమల్లో ఉంటాయని, ఈ లోపు ఎలక్ట్రానిక్ చెల్లింపుల లావాదేవీల చార్జీలపై తగిన సంప్రదింపుల అనంతరం ఓ కార్యాచరణ రూపొందిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ నెల చివరి వరకు డెబిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలను ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిక్ తదితర బ్యాంకులు రద్దు చేశాయి. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పెట్రోల్, రైల్వే టికెట్లు, ప్రభుత్వ రంగ బీమా పాలసీల ప్రీమియాన్ని డెబిట్, క్రెడిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా చెల్లిస్తే తగ్గింపు పొందే అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. లాటరీ ద్వారా బహుమతులను అందించే పథకాన్ని సైతం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications