English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

క్రెడిట్ కార్డు గురించిన ఈ అంశాలు మీకు తెలుసా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వాడటం ఎక్కువైపోయింది. ఐతే చాలా మంది వాటిని వాడటం సరిగ్గా రాకపోవటం వల్ల ఎక్కువ మొత్తంలో బ్యాంకులకు చెల్లిచాల్సి వస్తుందని వాపోతున్నారు. అందుకే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు వాటి నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. ఎంత పరిమితి మొత్తాన్ని ఆ కార్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు, ఆ కార్డుకు చెల్లించాల్సిన ఫీజు ఏమిటి, మనం వాడుకున్న మొత్తంపై ఎంత శాతం వడ్డీ విధిస్తారు మొదలైన వివరాలు తెలుసుకోవాలి. ఇలాంటి క్రెడిట్ కార్డు సంబంధిత ముఖ్య విష‌యాల‌ను తెలుసుకునేందుకు ఈ క‌థ‌నాన్ని చ‌ద‌వండి.

1. క‌నీస లావాదేవీ అంటే ఏమిటి?

1. క‌నీస లావాదేవీ అంటే ఏమిటి?

మ‌న ద‌గ్గ‌ర అవ‌స‌రాల‌కు న‌గ‌దు లేక ప్ర‌తి చిన్న‌దానికి కార్డు స్వైప్ చేయాల్సి వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఒక చిన్న షాపులో బిల్లు ఏ రెండు, మూడు వంద‌లు అయితే దానికి క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జ‌రిపేందుకు దుకాణ‌దారు అంగీక‌రించ‌డు. క‌నీసం ఇంత‌క‌న్నా ఎక్కువ బిల్లు చేస్తేనే కార్డు వాడుకోవ‌చ్చ‌ని చెపుతారు. అదే క‌నీస లావాదేవీ. ఈ-కామర్స్ వెబ్‌సైట్ల‌లో సైతం ఏవైనా కొనుగోళ్లు జ‌రిపిన‌ప్పుడు ఉచిత డెలివరీ సౌక‌ర్యం పొందాలంటే క‌నీస షాపింగ్ నిబంధ‌న ఉంటుంది క‌దా. ఇది కూడా అలాంటిదే. క‌నీస మొత్తానికి షాపింగ్ చేస్తేనే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపుల‌ను స్వీక‌రిస్తారు. దాని కోసం వినియోగ‌దారుడు అన‌వ‌స‌ర‌మైన‌వి కొన‌డం సాధ్యం కాని విష‌య‌మే.

2. ఉచిత‌ కార్డు(ఫ్రీ కార్డు) క‌థాక‌మామిషు

2. ఉచిత‌ కార్డు(ఫ్రీ కార్డు) క‌థాక‌మామిషు

ఇప్పుడు బ్యాంకుల మ‌ధ్య పోటీ ఎక్కువై కాల్స్ చేసి మ‌రీ క్రెడిట్ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. మామూలుగా ఫ్రీ కార్డు అర్థ‌మేమిటంటే జాయినింగ్ చార్జీల‌ను, మొద‌టి సంవ‌త్స‌రం మెయింటెనెన్స్ ఛార్జీల‌ను లేకుండా ఇస్తున్నార‌ని. అందుకే కార్డు జారీ స‌మ‌యంలో జీవిత కాల వార్షిక రుసుము(ఏఎమ్‌సీ) లేకుండా ఉందా లేదా అనే విష‌యాన్ని స్ప‌ష్టంగా తెలుసుకోవాలి. సిటీ బ్యాంక్ వంటివి కొన్ని నిబంధ‌న‌ల‌ను విధించ‌డం ద్వారా జీవిత కాల ఉచిత కార్డుల‌ను అందజేస్తున్నాయి.

3. మినిమ‌మ్ బ్యాలెన్స్ పేమెంట్‌(మినిమ‌మ్ అమౌంట్ డ్యూ)

3. మినిమ‌మ్ బ్యాలెన్స్ పేమెంట్‌(మినిమ‌మ్ అమౌంట్ డ్యూ)

క్రెడిట్ కార్డుకు సంబంధించి ప్రారంభంలో ఈ విష‌యంలో చాలామంది తిక‌మ‌క‌ప‌డుతూ ఉంటారు. మీరు బిల్లులో ఇంత మొత్తం చాలిస్తే చాలు అని మెసేజ్ వ‌స్తుంది. దాన్ని మినిమ‌మ్ బ్యాలెన్స్ అంటారు. ఈ మినిమ‌మ అమౌంట్ డ్యూల‌ను చెల్లించి ఊరుకుంటే మొత్తం అప్పు తీరినట్లు కాదు. ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వ‌డ్డీలు బాగా ఉంటాయి. అందుకే వాడిన మొత్తం బిల్లును బిల్లు తేదీ తుది గ‌డువు లోపు క‌ట్టేయాలి. సాధార‌ణంగా మ‌నం వాడుకున్న బ్యాలెన్స్‌లో 5శాతాన్ని మినిమ‌మ్ అమౌంట్ డ్యూగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

4. క్రెడిట్ కార్డ్ లిమిట్ (ప‌రిమితి)

4. క్రెడిట్ కార్డ్ లిమిట్ (ప‌రిమితి)

ప్ర‌తి క్రెడిట్ కార్డుకు ఒక ప‌రిమితి ఉంటుంది. కార్డుదారు ఎప్పుడైనా ప‌రిమితిని దాటితే... ఓవ‌ర్‌డ్రాఫ్ట్ రుసుములు, జ‌రిమానాలు ఉంటాయి.

క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలు క్రమం తప్పకుండా అప్పు చెల్లిస్తున్న వారికి, ప్రత్యేకించి ఎక్కువ మొత్తం చెల్లిస్తూ రుణభారాన్ని తగ్గించుకుంటున్న కార్డుదార్ల‌కు నిర్దిష్ట కాలపరిమితిలో క్రెడిట్‌ లిమిట్‌ను పెంచుతూ ఉంటాయి. ప‌రిమితిని పెంచుతున్న‌ప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు. అవ‌స‌ర‌మైతేనే ప‌రిమితిని పెంచుకోండి.

5.క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం

5.క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం

బిల్లులో ఐదు శాతం(మిన‌మ‌మ్ అమౌంట్ డ్యూ) మాత్రమే చెల్లించుకుంటూ పోతే తీసుకున్న రుణం ఎప్పటికీ తీరకపోవడమే కాకుండా క్రెడిట్‌ స్కోరు దెబ్బ తింటుంది. అందుకే ఏ క్రెడిట్‌ కార్డు వినియోగ‌దారు అయినా ఆ నెలలో తనపై ఉన్న బకాయి మొత్తంలో 20-25 శాతం చెల్లించడం వల్ల భారం క్రమంగా తగ్గుతూ వస్తుంది. క్రెడిట్‌ స్కోరు బాగుంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి లక్ష రూపాయల పరిమితి ఉండి అతను 50 వేల రూపాయలు వినియోగించుకున్నట్టయితే ఆ బిల్లు సైకిల్‌లో అందులో ఐదు శాతం అంటే 2,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కాని 50 వేల రూపాయల్లో 20 శాతం అంటే 10 వేల రూపాయలు లేదా 25 శాతం అంటే 12,500 రూపాయలు చెల్లిస్తే వారి క్రెడిట్‌ స్కోరుకి వచ్చే ముప్పేమీ ఉండదు.

6.బిల్లు చెల్లించకపోతే...

6.బిల్లు చెల్లించకపోతే...

నెలనెలా మీకు బిల్లు వచ్చినపుడు దాన్లో చెల్లించాల్సిన గడువు తేదీ ఉంటుంది. ఆ తేదీని జాగ్రత్తగా గుర్తుంచుకుని అప్పటిలోగానే బిల్లు చెల్లించేయాలి. అలా చేయకపోతే పెనాల్టీ, వడ్డీ కూడా క‌ట్టాల్సి రావ‌చ్చు.

7.బయటి ప్రాంతాల చెక్కులిస్తే..

7.బయటి ప్రాంతాల చెక్కులిస్తే..

ఉదాహ‌ర‌ణ‌కు మీరు హైద‌రాబాద్ నివాసి. మీకు ఎస్‌బీఐ కార్డుంది. బిల్లు చెల్లించే సమయానికి మీరు వేరే న‌గ‌రానికి వెళ్లి... అక్కడ క‌నుక చెక్కుపై చెల్లించారనుకోండి. మీ చెక్కు హైదరాబాద్‌ది కాబ‌ట్టి అదనపు ఛార్జీలవుతారుు. అలాకాక హైదరాబాద్‌లో ఉండి మీరు వేరే ప్రాంతపు చెక్కు ఇచ్చినా ఈ ఛార్జీలుంటాయి. ఇక ఈ చెక్ బౌన్సరుుతే జరిమానాలు, పెనాల్టీలు, ఆలస్య రుసుములు అన్నీ కలిసి భరించలేని స్థితికి తీసుకెళతాయి.

8.రివార్డు పాయింట్ల గురించి

8.రివార్డు పాయింట్ల గురించి

రివార్డు పాయింట్లు అధికంగా వస్తాయని ఒక కంపెనీ కార్డుని ఎంచుకోవడం మంచిది కాదు. కొనుగోళ్లను ప్రోత్సహించడానికి కంపెనీలు రివార్డ్ పాయింట్లతో ఆకర్షిస్తాయి. క్రెడిట్ కార్డును సరైం క్రమంలో వినియోగించకపోతే వినియోగదారుడికి తడిసి మోపడవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డును తరచూ వినియోగిస్తూ సకాలంలో చెల్లింపులు చేస్తే రివార్డు పాయింట్ల వల్ల ప్రయోజనం కలుగుతుంది. క్రెడిట్ కార్డుని సకాలంలో వినియోగించుకుని, చెల్లింపులు ఆలస్యం చేయకుండా ఉండే వినియోగదారుడికి మేలు జరుగుతుంది.

Read more about: credit card, online
English summary

Benefit from credit cards and what things you have to see before taking a card

In this new era of Globalization and technology, online shopping has become more convenient for people. Shopping has never been so easy for most of us. Due to demonetisation mall entrepreneurs and retailers are rushing to sell online because they know, the only way to deal with this change mess was to go where the customers were, that is online. credit cards are being issued by companies easily. While making online purchases use credit cards instead of a debit card as a safer choice
Story first published: Saturday, December 17, 2016, 10:56 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC