జీవిత బీమా తీసుకునేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. మీరు ఇప్పటికీ జీవిత బీమా తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటే ఈ 10 విషయాలు మీ కోసమే...
జీవితం మొత్తంలో బీమా తీసుకోవడం అనేది అతి కీలకమైన నిర్ణయం. కొంత మంది ముందుగానే బీమా తీసుకుంటారు. కొంత మంది చాలా ఆలస్యంగా జీవిత బీమా పాలసీ కొనుగోలు చేస్తారు. మీరు ఇప్పటికీ జీవిత బీమా తీసుకోవడం గురించి ఆలోచిస్తుంటే ఈ 10 విషయాలు మీ కోసమే...

1. అవసరం:
మీ కుటుంబ సభ్యులు లేదా మీపై ఆధారపడిన వారిని ఆర్థిక భద్రత గురించి ఆలోచిస్తున్నారంటే జీవిత బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం మంచిదే. దీంతో జీవితంలో అనిశ్చిత పరిస్థితులకు మీరు సిద్దమవుతున్నట్లు లెక్క. మీరు ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారా? మీకు భవిష్యత్తులో ఏ ఆర్థిక అవసరాలు రావని భావిస్తున్నారా? అయితే పాలసీ తీసుకునేముందు బాగా ఆలోచించండి. మీరు సంపాదించే వారై ఉండి, మీపై ఆధారపడే వారు ఉంటే తప్పకుండా జీవిత బీమా తీసుకోవాలి. ఇది మాత్రం మరిచిపోవద్దు.

2. ఉద్దేశం:
జీవిత బీమాకై పెట్టుబడి పెడితే అది ప్రాథమిక అవసరంగా భావించాలి. తర్వాతే దాని ఉద్దేశాన్ని గురించి ఆలోచించాలి. ఉదాహరణకు మీకు అనుకోకుండా ఏదైనా జరిగితే మీ పిల్లల చదువు కోసం బీమా హామీ మొత్తాన్ని కొన్ని పాలసీలు చెల్లిస్తాయి. కొన్ని ఉద్యోగాల్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వారు పాలసీ తీసుకుని ఉంటే కుటుంబ సభ్యులు ఆర్థికంగా భరోసాతో ఉంటారు.

3. కవరేజీ
ఒక్కో వ్యక్తి సంపాదన, ఆర్థిక స్థితి, అవసరాన్ని బట్టి కవరేజీ అవసరమవుతుంది. ఎంత జీవిత బీమా హామీ మొత్తం(కవరేజీ) కావాలనేది ఆయా వ్యక్తులు నిర్ణయించుకోవాలి. మీకు సరిగా తెలియకపోతే ఆర్థిక ప్రణాళిక నిపుణులను సంప్రదిస్తే మంచిది. కవరేజీని నిర్ణయించేముందు ఈ ముఖ్యాంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీ వయసు, వృత్తి, ఆరోగ్య పరిస్థితి, ఆదాయం, కుటుంబ సభ్యుల అవసరాలు మొదలైనవి. మీపై ఎంత మంది ఆధారపడ్డారనేది కూడా ముఖ్యం. మీ ఆర్థిక లక్ష్యాల్లో పాలసీ సైతం ఒక భాగం కావాలి.

4. కేటగిరీ
మీకు బీమా పాలసీ ఎందుకు అవసరం, బీమా హామీ మొత్తం ఎంత అనేది డిసైడ్ అయిన తరవ్ఆత ఎలాంటి పాలసీ తీసుకోవాలనే దాని గురించి ఆలోచించాలి. ఇందుకోసం పాలసీ రకాలను గురించి శోధించాలి. సాధారణంగా జీవిత బీమా అంటే టర్మ్ ఇన్సూరెన్స్ లేదా హోల్ లైఫ్ కవర్ అని భావించాలి. ఆ తర్వాత ఒకేసారి ప్రీమియం చెల్లించగలరా అనే విషయాన్ని గురించి ఆలోచించాలి. లేదా ఏడాదికి ఒకసారి కొంత మొత్తం చెల్లించగలరు అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవాలి. ప్రీమియం చెల్లింపు త్రైమాసికానికి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి చెల్లించే వెసులుబాటును జీవిత బీమా కంపెనీలు కల్పిస్తున్నాయి.

5. అప్పు:
అన్నీ ఆలోచించి పాలసీ తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఎంత వరకూ దాని కోసం వెచ్చించగలరనేది అతి ముఖ్యమైన అంశంగా పరిగణించుకోవాలి. ఇక్కడ మీకు ఇదివరకూ ఎంత అప్పులు ఉన్నాయనే అంశాన్ని సైతం లెక్కలోకి తీసుకోవాలి. ఒక్కోసారి మీకు ఉన్న అప్పుల కారణంగా మీరు తీసుకున్న బీమా హామీ మొత్తానికి తగ్గ ప్రీమియం చెల్లించే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి సంపాదన, అప్పులను బేరీజు వేసుకోవాలి. ప్రీమియం చెల్లింపు ఆలస్యమైతే పాలసీ ల్యాప్స్ అవుతుందనే విషయం మరవకండి. పాలసీ రెన్యువల్ చేసుకోవడానికి కంపెనీలు అధిక మొత్తంలో పెనాల్టీలు విధిస్తుంటాయి.

6. పెట్టుబడి:
బీమా పాలసీ తీసుకునేటప్పుడు పెట్టుబడి కోణాన్ని విస్మరించనక్కర్లేదు. యులిప్ పాలసీ తీసుకుంటే డెత్ బెనిఫిట్‌తో పాటు, కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అయితే కేవలం కవరేజీ గురించి ఆలోచించేవారు మాత్రం టర్మ్ పాలసీ తీసుకోవాల్సిందిగా సూచించడమైనది. అయితే ఇదివరకూ పాలసీ ఉండి ఇంకా అదనపు కవరేజీ, పెట్టుబడి రెండు కలగలిపి పాలసీ కావాలంటే యులిప్ వైపు మొగ్గుచూపొచ్చు. ఇది మీ పెట్టుబడి కాలంతో పాటు పెరిగేలా చేయడమే కాకుండా, మరో వైపు డెత్ బెనిఫిట్‌ను కూడా కవర్ చేస్తుంది.

7. ఆర్థిక రక్షణ:
జీవితంలో అనిశ్చిత పరిస్థితులైన మరణం, వైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి సమయాల్లో పాలసీ మీకు తోడుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద మరణిస్తే ఆధారపడిన వారికి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా కొంతవరకూ ఉపశమనంగా ఉంటుంది. చాలా బీమా కంపెనీలు పాలసీ హామీగా రుణ సదుపాయాన్ని సైతం అందుబాటులో ఉంచాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జీవిత బీమా పాలసీని హామీగా రుణాలిచ్చేందుకు అంగీకరిస్తాయి.

8. పొదుపు(సేవింగ్స్)
లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారంటే ఒక విధంగా కొంత మొత్తం పొదుపు చేసినట్లే. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినవారు ఒక విధంగా చేతిలో కొంత మొత్తం నగదు ఉన్నట్లే భావించొచ్చు.
పెట్టుబడి కలగలిపిన పాలసీలు తీసుకునే బదులు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని, మిగిలిన దాన్ని ఇతర పెట్టుబడి మార్గాల వైపు మళ్లించొచ్చు. పన్నుకు భిన్నంగా మీరు బీమా కోసం కేటాయించిన మొత్తం ప్రయోజనాలను చేకూర్చగలదు.

9. పన్ను ప్రయోజనాలు
కొంత మొత్తం వరకూ జీవిత బీమాకు చెల్లించే ప్రీమియంలకై పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉంటాయి. క్లెయిం సొమ్ముకు సైతం పన్ను ఉండదు. అయితే ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది. పాలసీకి వెచ్చించే మొత్తం పన్ను ప్రయోజనం కంటే ఎక్కువ ఉండే సందర్బాలు సైతం ఉంటాయి. దీన్ని బాగా ఆలోచించి ప్రీమియం నిర్ణయించుకుంటే మంచిది.

10. నియమ నిబంధనలు
ఒక్కో జీవిత బీమా పాలసీకి సంబంధించి నియమ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. అందుకోసమే పాలసీపై సంతకం చేసే ముందు పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవాలి. ప్రీమియం ఎంత చెల్లిస్తే భవిష్యత్తులో ఎంత ప్రయోజనం పొందగలరో అవగాహనను పొందాలి.
సమీప భవిష్యత్తులో మీకు ఏదైనా బోనస్ లేదా నగదు ప్రయోజనం ఉందేమో తెలుసుకోవాలి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications